చరణ్ డిమాండ్‌ను నాగి నెరవేరుస్తాడా?
జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుందని ఎప్పట్నుంచో అంతా కోరుతున్నారు.
By: Tupaki Desk | 9 May 2025 5:01 AMమే9, 1990లో టాలీవుడ్ లో రిలీజైన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఇప్పుడు దాన్ని 2డీ, 3డీ వెర్షన్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమాకు బాగానే హడావిడి చేసి స్పెషల్ హోర్డింగ్స్ తో పాటూ చిరంజీవి, రాఘవేంద్ర రావు, అశ్వినీదత్ ఓ ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చి దాన్ని రిలీజ్ చేశారు.
జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుందని ఎప్పట్నుంచో అంతా కోరుతున్నారు. ఈ సీక్వెల్ విషయంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు ఇంట్రెస్టింగ్ గా లేకపోయినప్పటికీ ఈ సీక్వెల్ పై నిర్మాత అశ్వినీదత్ మాత్రం ముందు నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో ఆ సీక్వెల్ చేస్తే బావుంటుందని చిరంజీవికి కూడా మనసులో ఉంది.
అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో ఓ వీడియోలో టీమ్ తో రామ్ చరణ్ మాట్లాడుతూ జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఆ రింగ్ ఏమైంది, చేప ఏమైంది లాంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలని తాను నాగ్ అశ్విన్ ను డిమాండ్ చేస్తున్నానని చెప్పడంతో ఒక్కసారిగా ఈ సీక్వెల్ పై అందరికీ ఆసక్తి పెరిగిపోయింది.
జగదేకవీరుడు అతిలోక సుందరి డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఆ సినిమా సీక్వెల్ కు రెడీగా లేకపోయినప్పటికీ చరణ్ సీక్వెల్ గురించి అడగడం, డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరును ప్రస్తావించడం చూస్తుంటే తెర వెనుక ఈ సీక్వెల్ కు సంబంధించిన ఆలోచన ఉందని అర్థమవుతుంది. చరణ్ నాగ్ అశ్విన్ ను డిమాండ్ చేస్తున్నా అని అన్నాడంటే ఆ సీక్వెల్ కు అతన్ని డైరెక్ట్ చేయమని ఇన్‌డైరెక్ట్ గా అడగడమే.
రాజు, ఇంద్రజలకు సంతానం కలిగి వాళ్లు రామ్ చరణ్, జాన్వీ అయితే ఆ కాంబినేషనే చాలా కొత్తగా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంది. రామ్ చరణ్ మాటల్ని నాగ్ అశ్విన్ సీరియస్ గా తీసుకుని దానిపై వర్కవుట్ చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం కల్కి2 స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్ ను తెరకెక్కిస్తే ఈ సినిమా సెన్సేషన్ సృష్టించడం ఖాయం.