బ్లాక్ బస్టర్ మూవీకి చిరూ, శ్రీదేవి ఎంత తీసుకుంటున్నారంటే
1990లో టాలీవుడ్ నుంచి వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సినిమాగా నిలిచిన వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి.
By: Tupaki Desk | 6 May 2025 6:24 AM1990లో టాలీవుడ్ నుంచి వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సినిమాగా నిలిచిన వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. ఈ సినిమా చిరంజీవి కెరర్లోనే ఓ స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 1990, మే 9న రిలీజైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషనే సృష్టించింది. ఈ ఏడాదికి ఆ సినిమా రిలీజై 35 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఆ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సోషియో ఫాంటసీ సినిమాను నిర్మాత అశ్వినీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా అశ్వినీదత్‌కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. 35 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్ అవడంతో ఫ్యాన్స్ ఈ మూవీ రీరిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా రీరిలీజవుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా కోసం చిరూ, శ్రీదేవి ఎంత తీసుకున్నారు? సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాను నిర్మాత అశ్వినీదత్ రూ.2 కోట్లు పెట్టి నిర్మించారట.
కానీ సినిమా చూస్తే ఇంతటి భారీ సినిమాను కేవలం రూ.2 కోట్లతో పూర్తి చేశారా అనే అనుమానం కచ్ఛితంగా కలుగుతుంది. రిలీజ్ టైమ్ లో భారీ వర్షాలుండటంతో ఫస్ట్ వీక్ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఆ తర్వాత వర్షాలు తగ్గి సిట్యుయేషన్స్ నార్మల్ అవడంతో థియేటర్ల కౌంట్ తో పాటూ హౌస్ ఫుల్స్ పెరిగాయి. అలా మంచి రన్ తో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా రూ.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.25 లక్షలు పారితోషికం తీసుకోగా, శ్రీదేవి రూ.20 లక్షలు అందుకుందని అప్పట్లో వార్తలొచ్చాయ. సినిమా రీరిలీజ్ సందర్భంగా ఇప్పుడు మరోసారి ఆ వార్తలు బయటికొస్తున్నాయి.