Begin typing your search above and press return to search.

JVAS అద్భుతాన్ని సృష్టించిన ముగ్గురు మొనగాళ్లు..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ హంగామా మొదలైంది.

By:  Tupaki Desk   |   6 May 2025 3:36 PM
JVAS అద్భుతాన్ని సృష్టించిన ముగ్గురు మొనగాళ్లు..!
X

మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ హంగామా మొదలైంది. సినిమా రిలీజై మూడు దశాబ్దాలు దాటింది. అందుకే అదే డేట్ న మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కేవలం 2డి మాత్రమే కాదు 3డి వెర్షన్ 4K రిజల్యూషన్ తో రీ రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం వైజయంతి టీం అంతా ఎంతో కష్టపడినట్టు తెలుస్తుంది.

జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా సృష్టికర్త దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు. ఆ సినిమా నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్. జగదేక వీరుడు అదే సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి రీ రిలీజ్ సందర్భంగా కలుసుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అద్భుతాన్ని సృష్టించిన ముగ్గురు మొనగాళ్లు ఒకచోట కలుసుకున్నారు.

సినిమా రీ రిలీజ్ సందర్భంగా వైజయంతి ప్రొడక్షన్ టీం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇప్పటికే జె.వి.ఏ.ఎస్ ప్రింట్స్ ఉన్న టీ షర్ట్స్ సినిమాలోని కొన్ని పోస్టర్స్ తో టీ షర్ట్స్ సిద్ధం చేశారు. రీ రిలీజ్ టైం లో కూడా కొత్త సినిమా రిలీజ్ రేంజ్ హంగామా కనిపిస్తుంది. 150 సినిమాల కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ 1 సినిమా అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి అనే చెబుతారు. ఆయనకు ఆ సినిమా ఇచ్చిన కమర్షియల్ సక్సెస్ కన్నా మెగా ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రేమ అభిమానమే ఎక్కువ.

జె.వి.ఏ.ఎస్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మరోసారి ఆ సినిమా రిలీజైన రోజులు గుర్తు చేసేలా మెగా ఫ్యాన్స్ సందడి చేయాలని చూస్తున్నారు. సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి, రాఘవేంద్ర రావు. అశ్వనిదత్ ఇలా ముగ్గురు కలిసి ఫోటోకి ఫోజు ఇవ్వడం రీ రిలీజ్ హంగామాని మరింత పెంచింది.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఫాంటసీ సినిమాల్లో నెక్స్ట్ లెవెల్ రికార్డులు అందుకుంది. అప్పట్లో సినిమా రిలీజ్ టైం లో వర్షాల వల్ల మొదటి రెండు రోజులు ఫ్యాన్స్ మాత్రమే చూసినా ఆ తర్వాత సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ ఆ సినిమా రిలీజ్ రోజులు గుర్తు చేసుకుని ఖుషి అవుతుంటారు.