Begin typing your search above and press return to search.

JVAS: ఈసారి 3D లో రాబోతున్న 'జగదేక వీరుడు'

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అలా గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'.

By:  Tupaki Desk   |   26 April 2025 7:39 PM IST
JVAS: ఈసారి 3D లో రాబోతున్న జగదేక వీరుడు
X

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అలా గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అద్భుతమైన కథ, మాయాజాలం నిండిన విజువల్స్, చిరు-శ్రీదేవి జోడీ మ్యాజిక్ అన్నీ కలిసొచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ. ఇప్పుడు ఈ సూపర్ క్లాసిక్ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి.అశ్వినిదత్ నిర్మించిన ఈ సినిమాను మళ్లీ 3డీ టెక్నాలజీలో రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మే 9న 2డీ, 3డీ ఫార్మాట్స్‌లో గ్రాండ్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లో జెవిఎఎస్ ఓ స్పెషల్ క్రేజ్ ను దక్కించుకోబోతుంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో ఇది ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న చిత్రం.

ఈ సినిమాలో ఇళయరాజా సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి పాట ఇప్పటికీ వినిపిస్తే మధురమైన భావనను కలిగించేలా ఉంటుంది. 'అబ్బని తియ్యని దెబ్బ', 'యమహో యమ' వంటి పాటలు తెలుగువారి గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసాయి. ఇదే కారణంగా ఈ సినిమాకు నేటి తరంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.

సాధారణంగా ఫాంటసీ, కామెడీ మిక్స్ చేసి రూపొందించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. కానీ జెవిఎఎస్ ఈ రెండింటినీ అద్భుతంగా మిళితం చేసి ప్రతి వయస్సు వారికి నచ్చేలా రూపొందింది. ముఖ్యంగా చిరంజీవి నటన, శ్రీదేవి అందం.. ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ సినిమాకి ప్రతిసారి రీ రిలీజ్ డిమాండ్ ఉండడం కూడా ఇదే కారణం.

ప్రస్తుతం ఈ సినిమాను అత్యాధునిక 3డీ టెక్నాలజీతో మళ్లీ థియేటర్లకు తీసుకొస్తుండటం అభిమానులలో ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే పోస్టర్‌లను చూసి రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మే 9న చిరంజీవి మళ్లీ తన మ్యాజిక్‌ను థియేటర్లలో ప్రదర్శించనున్నాడు. మరి సినిమా ఈ ట్రెండ్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.