Begin typing your search above and press return to search.

జాఫర్ సాధిక్‌... సూపర్ స్టార్స్ కి సెంటిమెంట్ గా మారాడు

ఈ మధ్య కాలంలో సూపర్‌ హిట్ అయిన విక్రమ్‌ సినిమా తో పాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ ఇంకా జవాన్ సినిమాల్లో కామన్ గా కనిపించిన నటుడు జాఫర్ సాధిక్‌.

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:14 AM GMT
జాఫర్ సాధిక్‌... సూపర్ స్టార్స్ కి సెంటిమెంట్ గా మారాడు
X

ఈ మధ్య కాలంలో సూపర్‌ హిట్ అయిన విక్రమ్‌ సినిమా తో పాటు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన జైలర్ ఇంకా జవాన్ సినిమాల్లో కామన్ గా కనిపించిన నటుడు జాఫర్ సాధిక్‌. ఇతడు కనిపించడానికి పొట్టిగా ఉన్నా కూడా నటన విషయం లో ఆ పాత్ర లో తన ముద్ద వేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు గాను జాఫర్‌ కి మంచి క్రేజ్ దక్కింది.

ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల్లో ఈయన పాత్ర ను క్రియేట్ చేస్తూ దర్శకులు ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ లో మార్పులు చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో ఆయనను సెంటిమెంట్ గా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం జాఫర్ కి మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా స్టార్స్ కి మోస్ట్‌ వాంటెడ్ గా మారాడు.

ఇటీవల జవాన్ సినిమా లో ఈయన పోషించిన పాత్రకు మంచి స్పందన దక్కింది. విక్రమ్‌, జైలర్‌, జవాన్ సినిమాల్లో కనిపించిన జాఫర్‌ సాధిక్‌ ఇక కెరీర్‌ లో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా సినీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు అయిదు సినిమాలు ఉన్నాయి.

తెలుగు లో కూడా జాఫర్‌ కనిపించాడు. సినిమాలో కాకుండా వెబ్ సిరీస్‌ లో జాఫర్ నటించాడు. అయితే ఆ సిరీస్ పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. దాంతో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే నటుడిగా ఆసిరీస్ లో మెప్పించాడు. కనుక ముందు ముందు తెలుగు లో కూడా స్టార్‌ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా ఈ పొట్టి నటుడు నిలిచే అవకాశాలు లేకపోలేదు.