Begin typing your search above and press return to search.

'జైల‌ర్' లో జాప‌ర్ ప్రియురాలు ఈ పిల్లే!

తాజాగా జాప‌ర్ త‌న ప్రియురాల్ని కూడా ప‌రిచ‌యం చేసాడు. ఆమె పేరు సిద్దిక‌.

By:  Tupaki Desk   |   26 Aug 2023 7:24 PM GMT
జైల‌ర్ లో జాప‌ర్  ప్రియురాలు ఈ పిల్లే!
X

కోలీవుడ్ న‌టుడు జాఫ‌ర్ సాధిక్ ఇప్పుడెంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. 'విక్ర‌మ్'..'జైల‌ర్' సినిమాలో బాగా ఫేమ‌స్ అయిన న‌టుడు. సినిమాలో అత‌డు చిన్న స‌న్నివేశంలో క‌నిపించినా! సినిమాకే హైలైట్. జాఫర్ సాదిక్ మరుగుజ్జు అయినప్పటికీ అతని నటన డాన్స్ ప్రేక్షకులను మెప్పించింది. త‌న‌లో ఆ లోపం సినిమాలో అవ‌కాశాలు క‌ల్పిస్తుంది. న‌టుడిగా జాప‌ర్ కి మును ముందు మంచి లైఫ్ ఉంది.

ఇత‌ర భాష‌ల్లోనూ అవ‌కాశాలు అందుకుంటున్నాడు. తాజాగా జాప‌ర్ త‌న ప్రియురాల్ని కూడా ప‌రిచ‌యం చేసాడు. ఆమె పేరు సిద్దిక‌. ఆమె కోలీవుడ్ లో మంచి డాన్స‌ర్. ప్రయివేట్ ఆల్బ‌మ్స్ కి కొరియోగ్ర‌ఫీ చేస్తుంది. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఎలా ఉంటా జాపర్ సాదిక్ కూడా కొరియోగ్రాఫ‌ర్. సొంతంగా ఓ డాన్స్ స్టూడియో ని కూడా నిర్వ‌హిస్తున్నాడు. విజ‌య్ టీవీలో రియాల్టీ షోలు చేసాడు.

అదే స‌మ‌యంలో సిద్దిక కూడా కింగ్స్ ఆప్ డాన్స్..జోడీ నెంబ‌ర్ వ‌న్ ..ఉంజాలిల్ యార్ ప్ర‌భుదేవా-2 వంటి డాన్సు షోల‌లో సిద్దిక పోటీ దారిగా క‌నిపించింది. అప్ప‌టి నుంచే ఆమెతో ప‌రిచ‌యం ఉంది. అలా ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం మొద‌లై ప్రేమ‌గా దారి తీసింది. వాస్త‌వానికి వీళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ న‌డుస్తుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారంలో ఉంది. కానీ అప్పుడు ఇద్ద‌రు అంగీక‌రించ‌లేదు.

తాజాగా జాప‌ర్ ఇండస్ట్రీలో స‌క్సెస్ అవ్వ‌డంతో ప్రియురాల్ని అధికారికంగా అంద‌రికీ ప‌రిచ‌యం చేసాడు. తొలుత జాప‌ర్ ఓ వెబ్ సిరీస్ లో న‌టించాడు. అందులో జాప‌ర్ న‌ట‌న చూసి లోకేష్ విక్ర‌మ్ సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు. ఇందులో జాప‌ర్ ప్ర‌త్యేక ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. దీంతో 'జైల‌ర్' సినిమాలో దిలీప్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విజ‌యం సాధించ‌డంతో జాప‌ర్ లైఫ్ మారిపోయింది.

ఇప్పుడు ఇత‌ర భాష‌ల్లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. న‌టుడిగా మంచి డిమాండ్ క‌నిపిస్తుంది. కామెడీ రోల్ తో పాటు నెగిటివ్ పాత్ర‌ల‌కు జాప‌ర్ త‌గ్గ‌వాడే. ఇక సిద్దిక ..జాప‌ర్ కంటే పెద్ద‌ది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు క‌లిసి దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.