Begin typing your search above and press return to search.

ఒక చిన్న న‌టుడు మూడు సినిమాలతో 2000 కోట్లు

అత‌డు వేరొక‌రున్నారు. 27 ఏళ్ల నటుడు ఒక‌రు భారతదేశంలో అత్యధిక వ‌సూళ్లు సాధించిన‌ సినిమాల్లో న‌టించాడు. అత‌డు గత మూడేళ్లలో విడుదలైన చాలా బ్లాక్‌బస్టర్ ల‌లో న‌టించాడు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 3:30 AM GMT
ఒక చిన్న న‌టుడు మూడు సినిమాలతో 2000 కోట్లు
X

ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి-బాహుబ‌లి 2 రెండిటి మొత్తం క‌లిపి బాక్సాఫీస్ వసూళ్లు 2200 కోట్లు. అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ వ‌సూళ్లు 1600 కోట్లు. షారూఖ్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్ - జ‌వాన్ వ‌సూళ్లు క‌లిపితే 2000కోట్లు. చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ న‌టించిన ఆర్.ఆర్.ఆర్ వ‌సూళ్లు 1000 కోట్లు పైనే. కానీ వీరంతా భార‌త‌దేశంలో అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకున్న ప్ర‌ముఖ స్టార్లు. కానీ అలాంటి ప్రాముఖ్య‌త ఏదీ లేకుండా స‌ద‌రు స్టార్ న‌టించిన మూడు సినిమాలు ఏకంగా 2000 కోట్లు వ‌సూలు చేసాయి. ఇంత‌కీ ఎవ‌రా స్టార్? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్బ్ వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. షారుఖ్ ఒకే సంవత్సరంలో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించాడు. పఠాన్ - జవాన్ ఒకదాని తర్వాత ఒకటి. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల క్ల‌బ్ లో చేరాయి. ఈ రెండిటి రూపంలో ఒక ఏడాదిలో 2000 కోట్ల వ‌సూళ్ల‌తో ఖాన్ నెవ్వ‌ర్ బిఫోర్ అనిపించాడు. ఇంతవరకు ఏ ఇతర నటుడూ ఈ ప్రత్యేకమైన ఫీట్‌ను సాధించలేకపోయారు. అయితే గత మూడేళ్లలో అత్యధికంగా ఆర్జించిన చిత్రాల న‌టుడు షారుఖ్ ఖాన్ లేదా ప్ర‌భాస్ కాదనేది మీకు తెలుసా? ..అత‌డు వేరొక‌రున్నారు. 27 ఏళ్ల నటుడు ఒక‌రు భారతదేశంలో అత్యధిక వ‌సూళ్లు సాధించిన‌ సినిమాల్లో న‌టించాడు. అత‌డు గత మూడేళ్లలో విడుదలైన చాలా బ్లాక్‌బస్టర్ ల‌లో న‌టించాడు.

తమిళనాడుకు చెందిన జాఫర్ సాదిక్ గురించే ఇదంతా. అత‌డేమీ పెద్ద స్టార్ కాదు. కేవ‌లం స‌హాయ‌న‌టుడు. కానీ అంత‌టి భారీ విజ‌యం సాధించిన సినిమాల న‌టుడిగా అత‌డి పేరు మార్మోగింది. సాధిక్ కి కోవిడ్ -19 మహమ్మారి తర్వాత కొన్ని పెద్ద చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. అత‌డు న‌టించిన‌ చివరి మూడు చిత్రాలు విక్రమ్- జైలర్- జవాన్. ఈ సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్స్. జాఫర్ సాదిక్ గత మూడు సినిమాలు మొత్తం 2000 కోట్లకు పైగా వసూలు చేశాయి.1995లో జన్మించిన జాఫర్ సాదిక్ నటుడిగా మారకముందు డ్యాన్సర్ కం కొరియోగ్రాఫర్‌. నెగెటివ్ పాత్రలు పోషించి ఖ్యాతిని పొందారు. కేవ‌లం 4 అడుగుల 8 అంగుళాల పొడవు ఉండే ఈ నటుడు 2020లో తమిళ సిరీస్ 'పావ కదైగల్'లో తన న‌ట‌న‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. 2022లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి హెంచ్ మాన్ గా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.414 కోట్లు రాబట్టింది. దీని తరువాత సాధిక్ 'వెందు తనింధతు కాదు' స‌హా వెబ్ సిరీస్ సైతాన్‌లో ముఖ్యమైన పాత్రలు చేశాడు. 2023లో అతడు రజనీకాంత్ - జైలర్ .. షారుఖ్ ఖాన్ -జ‌వాన్ చిత్రాల్లో సహాయ పాత్రలలో న‌టించాడు. ఆ మూడు సినిమాలు సుమారు 2000 కోట్ల వ‌సూళ్లు సాధించాయి. అంటే ఇటీవ‌లి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అన్నిటిలో అత‌డు న‌టించాడు. ఇది అరుదైన ఘ‌న‌త‌.

అయితే షారూఖ్‌- ప్ర‌భాస్- ర‌జ‌నీ లాంటి స్టార్ల‌తో అత‌డిని పోల్చ‌డం ఇక్క‌డ అస‌లు ఉద్ధేశం కాదు. అత‌డు న‌టించే సినిమాల‌న్నీ బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్లేన‌ని ఇప్పుడు ప‌రిశ్ర‌మ బ‌లంగా న‌మ్ముతోంది. అంతేకాదు ఒక న‌టుడిగా అత‌డు ఆ మూడు భారీ చిత్రాల్లో త‌న‌దైన ముద్ర వేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అత‌డు న‌టిస్తే చాలు బ్లాక్ బ‌స్ట‌రేన‌ని అంతా న‌మ్ముతున్నారు. దీనిని సెంటిమెంటుగా భావించి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అత‌డికి అవ‌కాశాలిస్తున్నార‌ని తెలిసింది. ఒక స‌హాయ న‌టుడు ఇలాంటి గొప్ప బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించ‌డం అత‌డి మైలేజ్ ని అమాంతం పెంచుతుంద‌ని చెప్పేందుకే ఈ క‌థ‌నం. అత‌డిని ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లు ల‌క్కీఛామ్ గా భావించి అవ‌కాశాలిస్తున్న‌ట్టు తెలిసింది. వ‌రుస‌గా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించే అవ‌కాశం అంద‌రు స్టార్ల‌కు రాదు. కానీ సాధిక్ మాత్రం మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించి ఇత‌ర న‌టీన‌టుల‌కు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.