Begin typing your search above and press return to search.

చిట్టిపొట్టి దుస్తుల్లో జాకీ చిందులు!

అందులో అమ్మ‌డు చిట్టిపొట్టి దుస్తుల్లో డాన్సు ప్రాక్టీస్ చేస్తుంది. తెలుపు వ‌ర్ణం కుర‌చ దుస్తుల్లో జాకీ స్టెప్పు లేస్తుంటే? కుర్రాళ్ల మ‌తి చెడిపోతుంది.

By:  Tupaki Desk   |   6 April 2024 7:15 AM GMT
చిట్టిపొట్టి దుస్తుల్లో జాకీ చిందులు!
X

జాక్వెలిన్ పెర్నాండేజ్ పేరు మనీలాండ‌రింగ్ కేసులో హైలైట్ అయిన ద‌గ్గ‌ర నుంచి సోష‌ల్ మీడియాలో యాక్టివిటీ త‌గ్గించింది. అప్ప‌టి నుంచి చాలా రేర్ గానే ఫోటోలు షేర్ చేస్తుంది. కేసుతో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని... కావాల‌నే ఇరికిస్తున్న‌ట్లు వాపోవ‌డం..సానూభూతి వంటి వ్యాఖ్య‌ల‌తో జాకీని చూసే విధానంలో కొంత మార్పు వ‌చ్చింది. శ్రీలంక‌లో త‌న కుటుంబ ప‌రిస్థితులు..వ్య‌క్తిగ‌తంగా తాను ఎదుర్కున్న స‌వాళ్లు గురించి మీడియా ఇంట‌ర్వ్యూల్లో చెప్పుకోవ‌డంత సింప‌తీ బాగానే వ‌ర్కౌట్ అయింది.

అప్ప‌టి నుంచి జాకీని నెటి జ‌నులు చూసే విధానంలో మార్పు వ‌చ్చింది. కాన్ మాన్ సుకేష్ చంద్ర మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆమె ఉందా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి. ఈ లోపు నెట్టంట మాత్రం త‌న‌పై వ‌చ్చిన నెగివిటీని చెరుకునే ప్ర‌య‌త్నంలో కొంత‌వ‌ర‌కూ స‌క్సెస్ అయింది. ఈ మ‌ధ్య కాలంలో మ‌ళ్లీ నెట్టింట ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది. ఫోటో షూట్ల‌తో..రీల్స్ తో నెట్టింట ర‌చ్చ చేస్తుంది. తాజాగా జాక్వెలిన్ నుంచి మ‌రో వీడియో రిలీజ్ అయింది.

అందులో అమ్మ‌డు చిట్టిపొట్టి దుస్తుల్లో డాన్సు ప్రాక్టీస్ చేస్తుంది. తెలుపు వ‌ర్ణం కుర‌చ దుస్తుల్లో జాకీ స్టెప్పు లేస్తుంటే? కుర్రాళ్ల మ‌తి చెడిపోతుంది. అస‌లే అమ్మడు హైట్..ఆ ఎత్తుకు త‌గ్గ దుస్తులు లేక‌పోతే అందాలు ఏ రేంజ్ లో హైలైట్ అవుతాయో తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. జాకీ బ్యూటీ పై..ఆమె వేస్తోన్న స్టెప్పుల‌పై కామెంట్లు అంతే ఆస‌క్తిక‌క‌రం.

ఇక జాక్వెలిన్ సినిమాల సంగ‌తి చూస్తే ఖాళీగానే క‌నిపిస్తుంది. కొత్త అవ‌కాశాలేవి రాన‌ట్లే క‌నిపిస్తుంది. ఈడీ విచార‌ణ నేప‌థ్యంలో కొంత వ‌ర‌కూ ఆప్ర‌భావం కెరీర్ పై ప‌డింది. చ‌ర్చ‌ల్లో ఉన్న కొన్ని ప్రాజెక్ట్ ల నుంచి కూడా ఆమెని తొల‌గించారు. గ‌త ఏడాది `పెట్చ్` అనే సినిమా క‌మిట్ అయింది. ఆ సినిమా ఇంకా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. అదెప్పుడు రిలీజ్ అవుతుంద‌న్న‌ది క్లారిటీ లేదు.