Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పొట్టి డ్రెస్ లో అందాల జాతర

తన అందాల ఆరబోత తో సినిమాలకు గ్లామర్‌ తెచ్చిన ఈ అమ్మడు పలువురు సూపర్‌ స్టార్ హీరోలకు జోడీగా నటించడం ద్వారా స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో నిలిచింది.

By:  Tupaki Desk   |   9 March 2024 12:30 PM GMT
పిక్ టాక్ : పొట్టి డ్రెస్ లో అందాల జాతర
X

శ్రీలంకకు చెందిన జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ 2006 మిస్ యూనివర్స్‌ పోటీకి వెళ్లింది. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా చేసింది. 2009 లో భారతదేశంలో అలాడిన్‌ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ ఇచ్చింది. బాలీవుడ్‌ లో అదే ప్రాజెక్ట్ తో ఎంట్రీ ఇచ్చింది. నటిగా బాలీవుడ్‌ లో స్టార్ డమ్ దక్కించుకుంది.


2011 లో వచ్చిన మర్డర్‌ 2 సినిమాతో బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందాల ఆరబోత తో సినిమాలకు గ్లామర్‌ తెచ్చిన ఈ అమ్మడు పలువురు సూపర్‌ స్టార్ హీరోలకు జోడీగా నటించడం ద్వారా స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో నిలిచింది.


సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో కూడా జాక్వెలిన్ చాలా యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయం నిజమే అంటూ తాజా ఫోటోలు మళ్లీ నిరూపించాయి.

తాజాగా సోషల్‌ మీడియాలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. పొట్టి డ్రెస్ లో నడుము నాభి అందాలను చూపిస్తూ థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఒల్లు విరుస్తూ ఉన్న ఈ అమ్మడి అందాల జాతరకి ఎంతటి వారు అయినా కూడా ఫిదా అవ్వాల్సిందే అంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

బాలీవుడ్‌ లో ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సౌత్‌ లో మంచి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడిని సౌత్‌ కి తీసుకు వచ్చేది ఎవరో చూడాలి.