జాకీతో ఎవరు ఈ కౌబోయ్?
జాకీతో శిఖర్ కెమిస్ట్రీ కూడా ఒక రేంజులో వర్కవుటైంది. శ్రేయ ఘోషల్ - కార్ల్ వైన్ ఈ పాటను ఆలపించారు.
By: Tupaki Desk | 11 May 2025 4:34 AM'సాహో'లో బ్యాడ్ గర్ల్ సాంగ్ తో సౌత్ ఆడియెన్ కి కనెక్టయిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ తో ముడిపడిన కేసులో తీవ్రంగా పోరాడుతోంది. మరోవైపు జాకీ బాలీవుడ్ కెరీర్ ని విడిచిపెట్టలేదు. వరుసగా సినిమాలు చేస్తోంది. సింగిల్ ఆల్బమ్స్ తోను సందడి చేస్తోంది. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి జాక్విలిన్ ఓ స్పెషల్ సింగిల్ సాంగ్ తో అభిమానుల ముందుకు వచ్చింది.
ఆసక్తికరంగా ఒక క్రికెటర్ ఇలా జాక్విలిన్ తో కలిసి సింగిల్ ఆల్బమ్‌లో నటించాలనే ఆలోచన క్రికెట్ ఫ్యాన్స్ లో ఉన్మాదం రేకెత్తించింది. ధావన్ ఫ్యాన్స్ ఈ వీడియోని జోరుగా ఆన్ లైన్ లో షేర్ చేస్తున్నారు. నాలుగురోజుల క్రితం విడుదలైన 'బెసోస్..' సాంగ్ లో శిఖర్ రకరకాల వేషధారణలతో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ ఈ పాట నుంచి కొన్ని స్టిల్స్ వెబ్ ని వేడెక్కిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అందమైన జాక్విలిన్ సరసన శిఖర్ ధావన్ హీమ్యాన్ లా ఉన్నాడు. పైగా హ్యాట్ ధరించి కౌబోయ్ ని తలపిస్తున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. జాకీతో శిఖర్ కెమిస్ట్రీ కూడా ఒక రేంజులో వర్కవుటైంది. శ్రేయ ఘోషల్ - కార్ల్ వైన్ ఈ పాటను ఆలపించారు.
భార్యకు విడాకులిచ్చిన శిఖర్ ఇటీవల ఓ విదేశీ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడంటూ ప్రచారం సాగుతోంది. ఈ జంటకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా ఇంటర్నెట్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో గ్లామరస్ హీరోయిన్ జాక్విలిన్ తో శిఖర్ సింగిల్ ఆల్బమ్ తో ముందుకు రావడం క్రేజీగా మారింది. ప్రస్తుతం బెసోస్ ఇంటర్నెట్ ని ఒణికిస్తోంది. టీజర్, పోస్టర్లు కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పీడ్ ఇటీవల తగ్గింది. అక్షయ్ కుమార్- తరుణ్ మన్సుఖాని లతో హౌస్‌ఫుల్ 5లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సాజిద్ నదియాద్‌వాలా నిర్మించారు. ఈ చిత్రం 6 జూన్ 2025న థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. చాలా డిలే తర్వాత ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కంటెంట్ కాపీరైట్ ఇష్యూస్ ని ఎదుర్కోవడం కూడా డిలేకు కారణమవుతోంది.