Begin typing your search above and press return to search.

సొంత ఐల్యాండ్ ఉన్న ఏకైక భార‌తీయ న‌టి

భారతీయ సిసీరంగంలోని చాలా మంది అగ్ర తారలు విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు.

By:  Tupaki Desk   |   9 May 2025 4:15 AM
సొంత ఐల్యాండ్ ఉన్న ఏకైక భార‌తీయ న‌టి
X

భారతీయ సిసీరంగంలోని చాలా మంది అగ్ర తారలు విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. కొంద‌రు తార‌లు ప్రైవేట్ జెట్‌లు, విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లతో సొంత‌ గ్యారేజీల్ని మెయింటెయిన్ చేస్తున్నారు. కానీ దేశంలో ఒకే ఒక్క న‌టికి సొంతంగా ఒక ప్ర‌యివేట్ ఐల్యాండ్(ద్వీపం) ఉంద‌న్న విష‌యం ఎంద‌రికి తెలుసు? ..

వివ‌రాల్లోకి వెళితే ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి జాక్విలిన్ సొంతంగా ఒక ప్ర‌యివేట్ ద్వీపాన్ని కొనుగోలు చేసారు. 2012లో ఆ భూమిని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు కోసం 600కె డాల‌ర్లు ఖర్చు చేసింది. దీని విలువ అప్పటికి దాదాపు రూ.3 కోట్లు. ఇక్క‌డ‌ జాక్వెలిన్ ఒక విలాసవంతమైన విల్లా నిర్మించాలనుకుంది. ఆ విల్లా తనకోసమేనా లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆ స్థలాన్ని లీజుకు ఇస్తారా? అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. కొనుగోలు చేసాక‌ ఆ ద్వీపంతో ఏం చేస్తోంద‌నేదానిపై కూడా స్పష్టత లేదు. కానీ ఇప్పటికీ ఒక ప్రైవేట్ ద్వీపానికి గర్వకారణమైన యజమాని.

రెండు దశాబ్దాలకు పైగా సినీరంగంలో చురుకుగా ఉన్న శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రైవేట్ ద్వీపాన్ని సొంతం చేసుకున్న ఏకైక బాలీవుడ్ నటి. శ్రీలంక దక్షిణ తీరంలో నాలుగు ఎకరాల ద్వీపాన్ని జాక్వెలిన్ సొంతం చేసుకుంది. 2012లో ఆ భూమిని కొనుగోలు చేసింది. టాలీవుడ్ చిత్రం సాహోలో జాక్విలిన్ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది.