ఎలన్ మస్క్ తల్లితో జాక్విలిన్ పూజలు
ప్రభాస్ `సాహో`లో బ్యాడ్ గర్ల్ పాటలో గ్లామర్ డాళ్ అవతారంలో కనిపించిన జాక్విలిన్ కి ఇటు సౌత్ లోను భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
By: Tupaki Desk | 22 April 2025 4:45 AMప్రభాస్ `సాహో`లో బ్యాడ్ గర్ల్ పాటలో గ్లామర్ డాళ్ అవతారంలో కనిపించిన జాక్విలిన్ కి ఇటు సౌత్ లోను భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ శ్రీలంకన్ బ్యూటీ టాలీవుడ్ కోలీవుడ్ లో పాపులరవ్వాలని భావించినా ఆశించినది జరగలేదు. అటు బాలీవుడ్ లోను కెరీర్ పరంగా అంతంత మాత్రమే. కాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ 200కోట్ల కుంభకోణంతో జాక్విలిన్ పేరు ముడిపడి ఉండటంతో ఈ భామకు అవకాశాలిచ్చేవాళ్లే కరువయ్యారు. తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో కొన్ని అవకాశాలు దక్కించుకున్నా కానీ, ఆశించిన స్థాయిలో కెరీర్ సాగడం లేదు.
తాజాగా జాక్విలిన్ ఈస్టర్ ఆదివారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఆలయంలో జాక్వి లిన్ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలాచరించారు. సందర్భానికి తగ్గట్టుగా జాకీ ట్రెడిషనల్ అవతార్ లో కనిపించింది. అయితే ఈసారి ఆలయ సందర్శనకు చాలా ప్రత్యేకత ఉంది. జాక్విలిన్ తో పాటు టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ తల్లి మాయే మస్క్ (77) తనతో పాటు ఆలయంలో ఉన్నారు. ఆ ఇద్దరూ వినాయకుని ఆలయంలో పూజారి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది.
జాక్వెలిన్ బంగారు రంగు ట్రెడిషనల్ శారీ, తలపై సాంప్రదాయ దుపట్టాను ధరించింది. మాయే మస్క్ ప్రింటెడ్ దుస్తులలో వెస్ట్రన్ లుక్ లో కనిపించారు. ఇద్దరూ ఆలయంలో పూజలాచరిస్తూ, పూజారి నుండి ఆశీర్వాదాలు కోరుతూ కనిపించారు. ముంబైలో సిద్ధి వినాయక ఆలయ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. నిరంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రశాంత చిత్తాన్ని అందించే ప్రత్యేక దేవాలయమిది.
నా డార్లింగ్ ఫ్రెండ్ మాయేతో కలిసి ఆలయంలో దేవుని ఆశీస్సులు తీసుకోవడం అందమైన అనుభవమని జాక్విలిన్ పేర్కొంది. ఒక పుస్తకావిష్కరణ కోసం మాయే భారతదేశంలో ఉన్నారని, వయస్సు ఒక సంఖ్య మాత్రమే స్నేహానికి ఇది అడ్డు రాదని పేర్కొన్న జాకీ.. మాయే రాసిన పుస్తకం తనకు చాలా నేర్పిందని పేర్కొంది.
మోడలింగ్, మాతృత్వం, వ్యవస్థాపక రంగాల్లో తన ప్రయాణం గురించి రచయిత మాయే మస్క్ తాను రాసిన స్ఫూర్తిదాయకమైన పుస్తకం `ఎ ఉమెన్ మేక్స్ ఎ ప్లాన్` హిందీ ఎడిషన్‌ను లాంచ్ చేయడం కోసం ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. తన 77వ పుట్టినరోజున సిద్ధివినాయక్ ఆశీస్సులు తీసుకున్నారు. ప్రముఖ సూపర్ మోడల్, పోషకాహార నిపుణురాలిగాను మాయే మస్క్ సుప్రసిద్ధులు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాక్వెలిన్ ఇటీవల సోనూసూద్ తో కలిసి `ఫతే` అనే యాక్షన్ చిత్రంలో నటించింది. అజయ్ దేవ్‌గన్ రైడ్ 2 లో ఒక ప్రత్యేక గీతంలో కనిపించనుంది. వెల్‌కమ్ టు ది జంగిల్, హౌస్‌ఫుల్ 5 లాంటి ఫ్రాంఛైజీ చిత్రాల్లో నటిస్తున్నా ఇవి అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే.