తిండి తినడానికి కూడా డబ్బుల్లేవన్నారు
అయితే ఈ మధ్య జాకీ భగ్నానీ ఫ్యామిలీ పలు వ్యాపారాలతో పాటూ సినిమాల్లో కూడా తీవ్రంగా నష్టపోయిందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 July 2025 11:05 AM ISTఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటరైన వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య జాకీ భగ్నానీ ఫ్యామిలీ పలు వ్యాపారాలతో పాటూ సినిమాల్లో కూడా తీవ్రంగా నష్టపోయిందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
జాకీ భగ్నానీ నుంచి గతేడాది బడే మియాన్ చోటే మియాన్ సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జాకీ భగ్నానీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో వచ్చన ఈ మూవీ స్క్రీన్ ప్లే బాగా వీక్ గా ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.
బడే మియాన్ చోటే మియాన్ ఫ్లాప్ తర్వాత జాకీ భగ్నానీ దివాలా తీశారని ఎన్నో రూమర్లు వచ్చాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ బడే మియాన్ చోటే మియాన్ రిలీజ్ తర్వాత తాను, తన ఫ్యామిలీ ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడారు. ఆ సినిమా తర్వాత తాను జుహూలో ఉన్న ఆఫీస్ ను తిరిగి డెవలప్ చేశానని, అలా వార్తల్లో నిలిచిన బిల్డింగ్ ఇదేనని, దివాలా తీయడం వల్ల దాన్ని అమ్మాల్సి వచ్చిందని, కనీసం తినడానికి కూడా తన దగ్గర డబ్బుల్లేవని, వీటన్నింటినీ తట్టుకోలేక తాను పారిపోయానని కూడా వార్తలొచ్చాయని జాకీ భగ్నానీ తెలిపారు.
అసలు ఈ రూమర్లన్నీ ఎలా మొదలయ్యాయో కూడా తనకు తెలీదని, ఈ విషయంలో తాను ఎవరినీ నిందించాలనుకోవడం లేదని భగ్నానీ అన్నారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ తర్వాత తన ఫ్యామిలీ చాలా కష్టాలు ఎదుర్కొన్న విషయం మాత్రం నిజమని, తాము మళ్లీ కడతామో లేదో అని బ్యాంకుల నుంచి లోన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని జాకీ భగ్నానీ వెల్లడించారు.