Begin typing your search above and press return to search.

బ్రాండ్ ఇమేజ్ ని వాడుకున్న వాళ్ల‌పై న‌టుడు ఎటాక్!

బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాప్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. అత‌డి స్టైల్..స్వాగ్ ప్ర‌తీది యూనిక్ గా ఉంటుంది

By:  Tupaki Desk   |   14 May 2024 1:05 PM GMT
బ్రాండ్ ఇమేజ్ ని వాడుకున్న వాళ్ల‌పై న‌టుడు ఎటాక్!
X

బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాప్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. అత‌డి స్టైల్..స్వాగ్ ప్ర‌తీది యూనిక్ గా ఉంటుంది. బాలీవుడ్ లో మిగ‌తా న‌టుల్ని జాకీని వేరు చేసే ప్ర‌త్యేక‌త‌లు ఎన్నో ఉన్నాయి. అందుకే జాకీ ష్రాప్ కిప్ర‌త్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. సోష‌ల్ మీడియాలో అత‌డి బ్రాండ్ తో ఎన్నో విష‌యాలు వైర‌ల్ అవుతుంటాయి. న‌డ‌క‌.. న‌డ‌త‌...వాయిస్ మాడ్యులేష‌న్.. మరీ ముఖ్యంగా ఆయ‌న నోట భీడు అనే ప‌దం వ‌చ్చిందంటే? క్రేజ్ మామూలుగా ఉండ‌దు.

స‌రిగ్గా ఇవ‌న్నీ ప‌ట్టుకుని కొంత మంది ష్రాప్ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోవ‌డం మొదలు పెట్టారు. చాలా కాలంగా ఇది సోష‌ల్ మీడియాలో కొన‌సాగుతుంది. తాజాగా వీటిపై టైగ‌ర్ ష్రాప్ సీరియ‌స్ అయ్యారు. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు. తన పేర్లను, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని, తన ముద్దుపేరు 'భిడు'ను అనధికారికంగా ఉపయోగించ కూడదని ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. జాకీ తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోగ్రాఫ్‌లు, వాయిస్ మరియు మారు పేరును ఉపయోగించుకున్నందుకు వివిధ సంస్థలపై దావా వేశారు.

ఈ కేసు నేడు విచార‌ణ‌కు వ‌చ్చింది. జాకీ చిత్రాలను, అభ్యంతరకరమైన మీమ్‌లలో ఉపయోగించినట్లు - అతని స్వరాన్ని ఇలాంటి ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసిన సందర్భాల గురించి కోర్టుకు తెలియజేశారు. ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డిన వారిపై 2 కోట్లు జ‌రిమానా విధించాల‌ని కోర్టును కోరారు. దీంతో హైకోర్టు వారంద‌రికీ నోటీసులు జారీ చేసింది. వ్య‌క్తిగ‌త హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్పడిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.

అలాగే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఆయా లింకులు త‌క్ష‌ణం తొల‌గించాల‌ని సూచించింది. మే 15న ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువ‌డుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఏఐ టెక్నాల‌జీతో సెల‌బ్రి టీల‌పై.. రాజ‌కీయ నాయ‌కుల‌పై ఎలాంటి వీడియోలు వ‌స్తున్నాయో తెలిసిందే. సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌క‌లా గెట‌ప్స్ ..అదే వాయిస్ తో ర‌క‌ర‌కాల వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.