Begin typing your search above and press return to search.

ప్రెంచ్ లేడీతో ఆ న‌టుడు బ‌యోపిక్!

బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాప్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. అత‌డి స్టైల్..స్వాగ్ ప్ర‌తీది ఎంతో యూనిక్ గా ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 May 2024 1:30 PM GMT
ప్రెంచ్ లేడీతో ఆ న‌టుడు బ‌యోపిక్!
X

బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాప్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. అత‌డి స్టైల్..స్వాగ్ ప్ర‌తీది ఎంతో యూనిక్ గా ఉంటుంది. బాలీవుడ్ లో మిగ‌తా న‌టుల నుంచి జాకీని వేరు చేసే ప్ర‌త్యేక‌త‌లు ఎన్నో ఉన్నాయి. అందుకే జాకీ ష్రాప్ కి ప్ర‌త్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. సీనియ‌ర్ హీరోలు ఎంత మంది ఉన్నా? జాకీ మాత్రం ఇప్ప‌టికీ సంథిగ్ స్పెష‌ల్. సోష‌ల్ మీడియాలో అత‌డి పాలోయింగ్ మామూలుగా ఉండ‌దు.

ఇప్ప‌టివర‌కూ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన జాకీ ఇప్పుడు ఏకంగా అత‌ర్జాతీయ ద‌ర్శ‌కురాలితోనే సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నారు. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రిన్ బొన్నారైతో స్లోజో అనే సినిమా చేస్తున్నారు. ఇదొక బ‌యోపిక్ కావ‌డం విశేషం. స్లోజో అని పిల‌చుకునే దివంగ‌త భార‌తీయ సంగీత ద‌ర్శ‌కుడు జోసెప్ మాన్యుయెల్ డా రోచా జీవితం ఆధారంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా జాకీ సంతోషం వ్య‌క్తం చేసారు. ఓ గొప్ప వ్య‌క్తి బ‌యోపిక్ లో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాల ప‌ట్ల అంకిత భావం, ప్ర‌తిభ ఉన్న సాండ్రిన్ లాంటి ద‌ర్శ‌కురాలితో క‌లిసి ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. జోసెప్ క‌థ‌ని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డానికి చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను` అని అన్నారు. ప్ర‌స్తుతం జాకీ ష్రాప్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు.

`టూ జీరో వ‌న్ ఫోర్`, `బేబి జాన్`, `సింగం ఎగైన్`, `బాప్` చిత్రాల్లో న‌టి స్తున్నాడు. గ‌త ఏడాది ఒక సినిమాతోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. అదీ ప్రైమ్ లో రిలీజ్ అయింది. దీంతో జాకీకి అవకాశాలు త‌గ్గాయా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ 2024 లో వ‌రుస‌గా కొత్త ప్రాజెక్ట్ లు షురూ చేయ‌డంతో అన్ని లెక్క‌లు తేల్చ‌బోతున్నాడు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ప్రెంచ్ డైరెక్ట‌ర్ తో సినిమా మ‌రింత ఆస‌క్తి క‌రంగా మారింది.