జాకీచాన్-శింబు కాంబినేషన్ ఊహించారా?
ఇటీవలే ముంబై వచ్చిన జాకీ చాన్ బాలీవుడ్ లో పూర్తిస్థాయిలో ఓ సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 May 2025 8:47 AMఇటీవలే ముంబై వచ్చిన జాకీ చాన్ బాలీవుడ్ లో పూర్తిస్థాయిలో ఓ సినిమా చేయాలని ఉందని ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఛాన్స్ బాలీవుడ్ లో రాలేదు కానీ మాలీవుడ్ లో మాత్రం వచ్చినట్లు కనిపిస్తుంది. జాకీ చాన్ - శింబు హీరోలుగా మాలీవుడ్ లో ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీనికి జ్యూడ్ అంథోనీ జోసెఫ్ దర్వకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్రలో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ పోషిస్తున్నట్లు సమాచారం.
ఆ సంగతి పక్కన బెడితే అనూహ్యంగా ఈ కాంబినేషన్ తెరపైకి రావడం నెట్టింట సంచలనంగా మారింది. భారతీయ చిత్రాల్లో నటించాలని ఉందని జాకీచాన్ చాలా సందర్భాల్లో ఇండియా వచ్చినప్పుడు చెప్పారు. కానీ సీరియస్ గా ఆయన ముంబైలో ఉండి ప్రయత్నాలు చేసింది లేదు. అయితే కొన్ని ఒకటి రెండు చిత్రాల కోసం జాకీచాన్ బాలీవుడ్ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంలో చేసారు. కానీ అవి పెద్దగా ఆడలేదు.
ఆ తర్వాత ఆయన భారతీయ చిత్రాలపై దృష్టి పెట్టలేదు. తాజాగా కరాటే కిడ్ లెజెండ్స్ ప్రచారంలో భాగంగా హిందీ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతుంది. జాకీచాన్ అంటే భారత్ లో అన్ని భాషలకు సుపరిచితుడే. విదేశీ నటుడైనా? గ్రామాల్లోనూ జాకీ చాన్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు.
అలాంటి నటుడితో శింబు కలవడం అన్నది ఆసక్తికరం. శింబు కెరీర్ విషయంలో సరైన అవకాశాలు ఇప్ప డిప్పుడే అందుకుంటున్నాడు. థగ్ లైఫ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శింబు ఇమేజ్ రెట్టింపు అవుతుంది అనే అంచనాలున్నాయి. ఇంతలోనే జాకీఛాన్ తో సినిమా శింబు సినిమా అనే ప్రచారం పీక్స్ కు చేరుతుంది.