Begin typing your search above and press return to search.

జాక్‌ సండే టెస్ట్.. నెక్స్ట్ 3 రోజులు మోస్ట్ క్రిటికల్!

టిల్లు సిరీస్‌తో యూత్ స్టార్‌గా నిలిచిన సిద్ధు జొన్నలగడ్డ.. 'జాక్‌' అనే కామెడీ ఎంటర్టైనర్‌తో ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చాడు.

By:  Tupaki Desk   |   12 April 2025 7:40 AM
జాక్‌ సండే టెస్ట్.. నెక్స్ట్ 3 రోజులు మోస్ట్ క్రిటికల్!
X

టిల్లు సిరీస్‌తో యూత్ స్టార్‌గా నిలిచిన సిద్ధు జొన్నలగడ్డ.. 'జాక్‌' అనే కామెడీ ఎంటర్టైనర్‌తో ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చాడు. టీజర్‌, ట్రైలర్‌లు ఓ మోస్తరు క్రేజ్ తెచ్చిపెట్టినా.. సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ మాత్రం కొంత నిరాశపరిచింది. పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉండటంతో మొదటి రోజు తర్వాత నుంచే కలెక్షన్లు డౌన్ కావడం మొదలైంది. రెండో రోజు జాక్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు.

ఇక రేపు, ఎల్లుండి, సోమవారం హాలిడేలను లాంగ్ వీకెండ్‌గా ను ఉపయోగించుకోవాలి. లేదంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డబ్బును రికవర్ చేసుకోవడం కష్టమే అవుతుంది. హైదరాబాద్‌తో పాటు కొన్ని అర్బన్ ఏరియాల్లో మాత్రం యూత్ ప్రేక్షకులు సినిమాకు వస్తున్నారు. కానీ మాస్ సెగ్మెంట్లో ఇంకా గ్రిప్ పడలేకపోయింది. సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేసి నిర్మాతలు కొంతవరకు సెఫ్ అయినట్లు తెలుస్తోంది.

కానీ ఈ డీల్ ద్వారా వచ్చిన మొత్తం నిర్మాతలకు మాత్రమే మిగిలింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన సొమ్ము తిరిగి రావాలంటే థియేట్రికల్ ఓపెనింగ్స్ బలంగా ఉండాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఆ ఒత్తిడిలోనే బృందం ప్రోమోషన్లపై ఫోకస్ పెట్టింది. జాక్ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. రొటీన్ కథకు కొత్త ట్రీట్‌మెంట్ ఇవ్వాలన్న దర్శకుడి ప్రయత్నం కొంతవరకు మంచి ఫన్ అందించినప్పటికీ.. పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

కథలో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, కొన్ని కామెడీ ట్రాక్‌లు పనిచేయకపోవడంతో ఫస్ట్ డే టాక్ నీరసించిపోయింది. మిగతా సినిమాలు గుడ్ బ్యాడ్ అగ్లీ, జాట్ తెలుగులో అంతగా జోరు చూపించకపోయినప్పటికీ.. జాక్ ఆ గ్యాప్‌ను పూర్తిగా ఫిల్ చేయలేకపోయింది. దీంతో ఈరోజు నుంచి వచ్చే మూడురోజుల వరకూ మూవీ బిజినెస్ పరంగా ఎంతవరకు నిలబడతుందన్నదే కీలకం. వేసవి సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులను ఆకర్షించగలిగితే ఎక్కువగా నష్టాలు రాకపోవచ్చు.

టిల్లు 2తో భారీ విజయాన్ని అందుకున్న సిద్ధు కోసం 'జాక్' ఒక మిడిల్ క్లాస్ స్టెప్ అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. బ్రాండ్ వాల్యూను కొనసాగించాలంటే.. ఈ మూవీ వసూళ్లలో కొంతైనా మెరుగుదల చూపించాలి. డిజాస్టర్ ట్యాగ్‌ తప్పించుకోవాలంటే.. 'జాక్‌' ఇప్పటికైనా జోరు పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఈ లాంగ్ వీకెండ్‌ను జాక్ ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి.