Begin typing your search above and press return to search.

బాలీవుడ్ సినిమా ప్రీ రిలీజ్ టాలీవుడ్ లోనా!

బాలీవుడ్ లో సినిమా రిలీజ్ అంటే పెద్ద‌గా ఎలాంటి ప్ర‌చారం ఉండ‌దు. సింపుల్ గా రిలీజ్ కు ముందు ఓ ప్రెస్ మీట్ మాత్రం ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   9 April 2025 6:04 PM IST
Jaat Movie to Break Bollywood Norms
X

బాలీవుడ్ లో సినిమా రిలీజ్ అంటే పెద్ద‌గా ఎలాంటి ప్ర‌చారం ఉండ‌దు. సింపుల్ గా రిలీజ్ కు ముందు ఓ ప్రెస్ మీట్ మాత్రం ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తుంటారు. ఆ త‌ర్వాత సినిమా హిట్ అయితే జ‌నాలు మాట్లాడు కుంటారు. లేక‌పోతే లేదు. అంత‌కు మించి ప్ర‌త్యేకంగా ప్ర‌చారం కోసం బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాతలు, న‌టులు స‌మ‌యం కేటాయించరు. కానీ `జాట్` సినిమా కోసం మాత్రం టాలీవుడ్ లో ఈవెంట్ నిర్వ‌హిం చ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

స‌న్ని డియోల్ హీరోగా గోపీచంద్ మ‌లినేని బాలీవుడ్ లో `జాట్` చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలి సిందే. ఏప్రిల్ 10న హిందీ వెర్ష‌న్ రిలీజ్ అవుతుంది. వారం గ్యాప్ లో తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. మ‌రి ఈ సినిమాకి ఇక్క‌డ ఈవెంట్ ఎలా సాధ్య‌మంటే? ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్-పీపూల్ మీడియా ఫ్యాక్ట రీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవి తెలుగు నిర్మాణ సంస్థ‌లు కావ‌డంతో ఇక్క‌డ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే హైద‌రాబాద్ లో నే ఈవెంట్ నిర్వ‌హించాల‌ని చూస్తున్నారుట‌. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. ఈ సినిమా హిందీ వెర్ష‌న్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో నార్త్ లో మంచి బ‌జ్ కూడా క్రియేట్ అయింది.

దీంతో గోపీచంద్ మాస్ ఎలివేష‌న్ అక్క‌డ వ‌ర్కౌట్ అవుతుంద‌నే అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి. మ‌రి అక్క‌డ హిట్టా? ప‌ట్టా అన్న‌ది మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోతుంది. పాజిటివ్ టాక్ వ‌స్తే టాలీవుడ్ కి మంచి హైప్ తో తీసుకొస్తారు. మ‌రి టాక్ డివైడ్ గా వ‌చ్చిందంటే? ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారు? అన్న‌ది చూడాలి.