Begin typing your search above and press return to search.

‘జాట్’ సునామి… అక్కడ సన్నీ పంచ్ కి సాలిడ్ రెస్పాన్స్!

బాలయ్యతో వీర సింహా రెడ్డి, రవితేజతో క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని, తాజాగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   12 April 2025 1:11 PM IST
‘జాట్’ సునామి… అక్కడ సన్నీ పంచ్ కి సాలిడ్ రెస్పాన్స్!
X

బాలయ్యతో వీర సింహా రెడ్డి, రవితేజతో క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని, తాజాగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఆయన డైరెక్షన్‌లో సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా సినిమా ‘జాట్’ ఏప్రిల్ 11న గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా మీద తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హైప్ లేకపోయినా, నార్త్ ఇండియాలో మాత్రం దుమ్మురేపుతోంది. ఫస్ట్ డే నార్త్ బెల్ట్‌లో ఓ మోస్తరు ఓపెనింగ్స్ వచ్చిన ‘జాట్’, సెకండ్ డే నుంచే జోరు పెంచింది.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ వంటి ప్రాంతాల్లో సన్నీ డియోల్ క్రేజ్ హై లెవెల్లో ఉండటంతో టికెట్ కౌంటర్ల వద్ద ప్రేక్షకుల క్యూ కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ సినిమా ఎలివేషన్లకు బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా లాంగ్ వీకెండ్‌+సండే ప్రభావంతో సూపర్ కలెక్షన్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం జాట్ వీకెండ్ వసూళ్లు రూ.30 కోట్లు దాటి ఉండే అవకాశం కనిపిస్తోంది.

సోమవారం సెలవు కావడంతో 4 రోజుల వరకూ సినిమాకు బాక్సాఫీస్ పై మరింత లాభపడే అవకాశం ఉంది. మాస్ ఓరియెంటెడ్ కంటెంట్‌ను నార్త్ టేస్ట్‌కు తగ్గట్టు చూపించడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించగా గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. మాస్ డైనమిక్ మిక్స్ తో చేసిన ఈ ప్రయత్నం, బాక్సాఫీస్ వద్ద మెల్లగా పికప్ అవుతూ బజ్‌ను పెంచుకుంటోంది.

మలినేని తన మాస్ ఎలివేషన్లను బాలీవుడ్ టెంప్లేట్‌లో ఎలాంటి మార్పులు లేకుండా మిక్స్ చేసి చూపించారు. ఈ సినిమాలో రేజీనా కసాంద్రా ఒక కీలక పాత్రలో నటించగా, సయ్యామి ఖేర్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మాస్ మూడ్ తీసుకువచ్చేలా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్ డెలివరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ బాలీవుడ్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నట్టు ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

సాధారణంగా దక్షిణ భారత దర్శకులకు బాలీవుడ్‌లో తొలి సినిమానే పెద్ద ప్రూవింగ్ పాయింట్‌గా మారుతుంది. ఈ విషయంలో గోపీచంద్ మలినేని ‘జాట్’తో ఓ మోస్తరు హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి