'జాట్ -2' ప్రారంభోత్సవం ఫిక్సైపోయిందా!
ఇటీవల రిలీజ్ అయిన `జాట్ 2` కి మంచి టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రచార చిత్రాల హైప్ తో సిని మాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
By: Tupaki Desk | 19 April 2025 6:25 AMఇటీవల రిలీజ్ అయిన `జాట్ 2` కి మంచి టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రచార చిత్రాల హైప్ తో సిని మాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అయితే ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమా రిలీజ్ అయిన నేటికి తొమ్మిది రోజులు గడుస్తోంది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా మరికొన్ని రోజులు సమయం పడుతుంది. మిగిలిన 40 శాతం రివకరీ అయినపుడే 'జాట్' అసలైన సక్సెస్ సాధించినట్లు. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.
హిందీ రిలీజ్ అనంతరం వారం తర్వాత రిలీజ్ చేస్తామన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. కానీ ఇంత వరకూ రిలీజ్ జరగలేదు. దీంతో రిలీజ్ ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు కూడా వ్యక్త మవుతున్నాయి. దీంతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో `జాట్ 2` ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే టీమ్ తో మళ్లీ సినిమా చేస్తున్నట్లు గోపీచంద్ మలినేని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రె స్టింగ్ అప్ డేట్ అందింది.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు గొపీచంద్ తెలిపారు. రెండో భాగంలో సన్ని డియోల్ కుటుంబ నేపథ్యాన్ని చూపిస్తామన్నారు. దీంట్లో ` జాట్` కంటే యాక్షన్, ఎమోషన్, కామెడీ సన్నివేశాలుంటాయని తెలిపారు. వికీ సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు ...ఇప్పటి వరకూ రాబట్టిన రివకరీ 82.75 కోట్లగా తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం తెలియాల్సి ఉంది.
అయితే వసూళ్ల తోసంబంధం లేకుండా? సినిమా టాక్ ని బట్టి కొన్ని సార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు దర్శక-నిర్మాతలు. దేవర సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో `దేవర 2` ఉంటుందా? ఉండదా? అన్న సందేహం వ్యక్తమైంది. కానీ `దేవర 2` కచ్చితంగా ఉంటుందని హీరో, దర్శకులు బల్ల గుద్ది మరీ చెప్పారు. పబ్లిక్ గానూ ప్రకటించారు. తాజాగా జాట్ 2 విషయంలో కూడా మేకర్స్ అదే కాన్పిడెన్స్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే గోపీచంద్ మలినేని రెట్టించిన ఉత్సాహంతో పార్ట్ 2ప్రకనతో ముందు కొచ్చారు.