Begin typing your search above and press return to search.

ఇజ్జత్.. మెగా బ్రాండ్ తో ఇచ్చిపడేశారు

ఇక ఇజ్జత్ అనే పాటను మెగాస్టార్ చిరంజీవికి డెడికేట్ చేస్తున్నట్లుగా హైలైట్ చేసిన విధానం ఎంతగానో కట్టుకుంటుంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 2:29 PM GMT
ఇజ్జత్.. మెగా బ్రాండ్ తో ఇచ్చిపడేశారు
X

మెగాస్టార్ చిరంజీవి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం నటుడిగా మాత్రం ఆయానపై ఎవరు రిమార్కు చూపాల్సిన అర్హత సంపాదించుకోలేదు అనే చెప్పాలి. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. చాలా కాలం పాటు రక్తదానం కార్యక్రమంలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

అభిమానులు సపోర్ట్ తో సక్సెస్ లు కొట్టడం కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయించారు. అదేవిధంగా కరోనా లాక్డౌన్ సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆక్సిజన్ అందించే ప్రాణాలు నిలిపారు. అయితే ఆ మెగాస్టార్ హోదాతో పాటు ఆయన మంచితనాన్ని హైలైట్ చేస్తూ విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇచ్చే విధంగా బాబుల్ గమ్ అనే సినిమా నుంచి ఒక స్పెషల్ వీడియో మూమెంట్ ను హైలెట్ చేశారు.

యాంకర్ సుమ వారసుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న సినిమా బబుల్ గమ్ నుంచి ఇటీవల ఇజ్జత్ అనే పాటను మెగాస్టార్ చిరంజీవి చేతుల ముద్దుగా విడుదల చేశారు. ఇక మెగాస్టార్ సపోర్టుతో ఈ సినిమాకు మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇజ్జత్ అనే పాటను మెగాస్టార్ చిరంజీవికి డెడికేట్ చేస్తున్నట్లుగా హైలైట్ చేసిన విధానం ఎంతగానో కట్టుకుంటుంది.

ఆ పాటలో మెగాస్టార్ సినిమాలతో పాటు ఆయన స్టార్ హోదాను ప్రత్యేకంగా హైలెట్ విధానం మెగా అభిమానులను ఆకట్టుకుంది. ఇక మెగా బిగ్గెర్ దెన్ అమితాబ్ బచ్చన్ అనే ట్యాగ్ నుంచి మొన్నటి వాల్తేరు వీరయ్య సినిమా వరకు అన్ని రకాల హైలెట్ ఐకాన్ మూమెంట్స్ తో వీడియోలో హైలెట్ చేశారు. ఇజ్జత్ అనే పాటకు మెగాస్టార్ బ్రాండ్ ఇమేజ్ పర్ఫెక్ట్ అనే కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి.

ఇక రాజీవ్ కనకాల, యాంకర్ సుమ వారసుడు రోషన్ కనకాల మొదటి సినిమాకు ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల నుంచి మంచి సపోర్ట్ అందుకుంటూ ఉన్నాడు. రవికాంత్ పెరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్స్ సాంగ్స్ తోనే హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అతను ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.