Begin typing your search above and press return to search.

బుజ్జి క‌న్నా అంటూ బుట్ట‌లో వేస్తున్నారా?

'ల‌వ్ టుడే'తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన యంగ్ బ్యూటీ ఇవానా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సినిమాతోనే అమ్మ‌డు యువ‌త అటెన్ష‌న్ డ్రా చేసింది.

By:  Tupaki Desk   |   5 May 2025 7:00 AM IST
Ivana About Telugu Fans
X

'ల‌వ్ టుడే'తో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన యంగ్ బ్యూటీ ఇవానా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సినిమాతోనే అమ్మ‌డు యువ‌త అటెన్ష‌న్ డ్రా చేసింది. యూత్ పుల్ లవ్ స్టోరీ తో కుర్ర కారులో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. వైవిథ్య‌మైన హ‌వ‌భావాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. తాజాగా అమ్మ‌డు 'సింగిల్' అనే సినిమాతో తెలుగులోనూ లాంచ్ అవుతుంది. ఇందులో శ్రీవిష్ణుకు జోడీగా న‌టించింది.

తొలి సినిమానే ప్ర‌తిష్టాత్మ‌క గీతా ఆర్స్ట్ లో అవ‌కాశం రావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసింది. అలాగే తెలుగు కుర్రాళ్లు త‌న‌ని ఎలా పిలుస్తారో కూడా గుర్తు చేసుకుంది. 'హైద‌రాబాద్ కి ఎప్పుడొచ్చినా ఇక్క‌డ ఆడియ‌న్స్ అంతా బుజ్జి, క‌న్నా అంటూ పిలుస్తున్నారు. బ‌హుశా ల‌వ్ టుడే లో నేను పోషించిన పాత్ర ప్ర‌భావం అనుకుంటా. అలా పిల‌వ‌డం నాకెంతో సంతోషాన్నిస్తుంది. తొలి సినిమాతోనే న‌న్ను గుర్తు పెట్టుకుని అలా పిలిచారంటే న‌న్నెంత అభిమానిస్తున్నారు? అన్న‌ది అర్ద‌మ‌వుతుంది.

'సింగిల్' సెట్ లో వీలైనంత వ‌ర‌కూ తెలుగులోనే మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించా. భాష పూర్తిగా నేర్చుకోవాలి. తెలుగు చాలా అంద‌మైన భాష‌' అంటోంది. న‌టిగా ఇవానా కెరీర్ మాలీవుడ్ లో మొద‌లైంది. 'మాస్ట‌ర్స్' సినిమాతో న‌టిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. అటుపై మాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసి స‌క్సెస్ లు అందుకుంది. అనంత‌రం అమ్మ‌డు కోలీవుడ్ కి ప్ర‌మోట్ అయింది.

కోలీవుడ్ లో రెండు సినిమాల త‌ర్వాత `ల‌వ్ టుడే`లో న‌టించింది. ఈ సినిమా మంచి విజ‌యంసాధించ డంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ గుర్తింపు ద‌క్కింది. ఆ మ‌ధ్య రిలీజ్ అయిన `డ్రాగ‌న్` లోనూ గెస్ట్ రోల్ పోషించింది. క‌నిపించింది కొన్ని నిమిషాలైనా ఇవానా రాక‌తో థియేట‌ర్లు ఒక్క‌సారిగా మోతెక్కాయి. `ల‌వ్ టుడే` కాంబినేష‌న్ మ‌ళ్లీ స్క్రీన్ పై క‌నిపించ‌డంతోనే ఆ రేంజ్ లో రెస్పాన్స్ వ‌చ్చింది.