ఎంత హైటున్న హీరో అయినా ఒకే!
సక్సెస్ పరంగా ఇవానా ట్రాక్ బాగుంది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ పాజిటివ్ గానే కనిపి స్తుంది. యూత్ లోనూ క్రేజీ బ్యూటీగా వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 25 July 2025 7:00 AM IST`లవ్ టుడే`తో టాలీవుడ్ కి పరిచయమైన యంగ్ బ్యూటీ ఇవానా గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి సినిమాతోనే అమ్మడు యువత అటెన్షన్ డ్రా చేసింది. యూత్ పుల్ లవ్ స్టోరీ తో కుర్ర కారులో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. వైవిథ్యమైన హవభావాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే `సింగిల్` తో తెలుగులోనూ లాంచ్ అయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. కేతిక పాత్ర కంటే ఇవానా పాత్రకే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ ఛాన్స్ అందు కుందనే ప్రచారం జరుగుతోంది.
సక్సెస్ పరంగా ఇవానా ట్రాక్ బాగుంది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ పాజిటివ్ గానే కనిపి స్తుంది. యూత్ లోనూ క్రేజీ బ్యూటీగా వైరల్ అవుతోంది. `సింగిల్` తర్వాత తెలుగులో ఫాలోయింగ్ రెట్టింపు అయింది. ఇక ఇవానా వయసు విషయానికి వస్తే అమ్మడికి 25 ఏళ్లు. అంటే స్టార్ హీరోలందరితో నటించే వయసే. 20 ఏళ్ల నటే 50-40 ఏళ్ల వయసున్న హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇవానికి వయసు అడ్డండి కాదు. మరి హైట్ సంగతేంటి? అంటే అమ్మడు ఎత్తు ఐదు అడుగులే.
అయినా సరే నటిగా తానెంత ఎంత పెద్ద స్టార్ అయినా....ఎంత హైట్ ఉన్నా సరే మ్యానేజ్ చేస్తానంటూ నమ్మకాన్ని వ్యక్తం చేసింది. నటికి హైట్ అన్నది పెద్ద సమస్య కాదని ధీమా వ్యక్తం చేసింది. నిజమే నిజం గా హైట్ సమస్య అయితే రష్మికా మందన్నా నేషనల్ క్రష్ అయ్యేదా? నేడు రష్మిక పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రష్మిక ఇవానా కంటే కాస్త పొడవు. 5.3 రష్మిక హైట్. కానీ కెమెరా యాంగిల్ లో రష్మిక కంటే ఇవానా ఎత్తుగా కనిపిస్తుంది. శరీరంలో కొన్ని రకాల మార్పులే ఇలాంటి వ్యత్యాసానికి దారి తీస్తుంటాయి? అన్నది తెలిసిందే.
ప్రస్తుతం ఇవానా టాలీవుడ్ నే టార్గెట్ చేసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇక్కడ అవకాశాలు వస్తే ఇక్కడే బిజీ అవ్వాలని కోరుకుంటుంది. నటిగా ఇవానాను ఎంచాల్సిన పనిలేదు. మంచి పెర్పార్మర్. యువ నాయికలకు బాగా సెట్ అవుతుంది. కెరీర్ ఇప్పుడే మొదలైంది కాబట్టి నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది. మరి ఇవానా ప్రతిభను ఎంత మంది గుర్తిస్తారో చూడాలి.
