రొమాంటిక్ బ్యూటీకి రొమాన్స్ నచ్చకపోతే ఎలా?
మాలీవుడ్ బ్యూటీ ఇవానా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుంది. ఇటీవల రిలీజ్ అయిన `సింగిల్` తో తొలి తెలుగు స్ట్రెయిట్ హిట్ అందుకుంది.
By: Tupaki Desk | 19 May 2025 5:00 AM ISTమాలీవుడ్ బ్యూటీ ఇవానా టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుంది. ఇటీవల రిలీజ్ అయిన `సింగిల్` తో తొలి తెలుగు స్ట్రెయిట్ హిట్ అందుకుంది. సినిమాలో సెకెండ్ లీడ్ పోషించినా మరోసారి తనదైన పెర్పార్మెన్స్ తో ఆకట్టుకుంది. తొలి సినిమా లవ్ స్టోరీతోనే పాపులర్ బ్యూటీగా మారిన ఇవానాకు సింగిల్ సక్సెస్ కలిసొచ్చింది. `డ్రాగన్` క్లైమాక్స్ లో ఎంట్రీ తో ఒక్కసారిగా థియేటర్లను ఊపేసింది.
అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు జోరందుకున్నాయి. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమాకి రెడీ అవుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇంకా యంగ్ హీరోలకు పర్పెక్ట్ జోడీ కావడంతో దర్శకులు చూపు ఇవానా వైపే ఉంది. పారితోషికం పరంగానూ అందుబాటులో ఉండే నాయిక కాబట్టి నిర్మాతలు ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఇవానా తాజా వ్యాఖ్యాలతో హీరో-దర్శక-నిర్మాతలు ఊసురుమనేలా ఉన్నారు. ఈ బ్యూటీకి హీరోలతో రొమాన్స్ ఎంత మాత్రం ఇష్టం ఉండదంది.
రొమాంటిక్ సీన్స్, గ్లామర్ సీన్స్, ముద్దులు, పెదవి ముద్దులు వంటి సన్నివేశాల్లో నటించడం అంటే చికాకుగా ఉంటుందని తెలిపింది. వాటికి బధులు ఎమోషన్స్ సీన్స్ బాగా చేస్తానని...వాటిలో లీనమై పోతానంటోంది. అలాగే యాక్షన్ చిత్రాల్లో ఫైటింగ్ లు చేయాలన్నా ముందుంటానంది. 12 ఏళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చినా కొన్ని అవమానాలు ఎదుర్కున్నట్లు గుర్తు చేసుకుంది. హైట్ లేనని విమర్శిం చేవారట.
ఇలా ఉంటే అవకాశాలు ఎవరిస్తారని కామెంట్ చేసినట్లు గుర్తు చేసుకుంది. విమర్శల సంగతి పక్కన బెడితే? ఇవానాతో యాక్షన్ సినిమాలు...ఎమోషన్ కథలు తీసే దర్శకులు ఎవరుంటారు? ఇవానా అంటే యూత్ లో క్రీజీ బ్యూటీ. ఆమెతో రొమాంటిక్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తారు. మంచి పెర్పార్మర్ కాబట్టి అందుకు స్కోప్ ఉంటుంది. ఇవానా మెచ్చిన కథలు రావాలంటే తాను పెద్ద స్టార్ అయిన తర్వాతే సాధ్యమవుతుంది.