Begin typing your search above and press return to search.

ఇలా అయితే కష్టమే ఆదికేశవ..!

మరోపక్క సితార నిర్మాత నాగ వంశీ ఈ సినిమా గురించి ఎంత పాజిటివ్ గా చెప్పినా ఆడియన్స్ లో అటెన్షన్ రావట్లేదు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 1:03 PM GMT
ఇలా అయితే కష్టమే ఆదికేశవ..!
X

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదికేశవ. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు కావాల్సినంత బజ్ అయితే ఏర్పడలేదని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ ఒకటి రెండు సార్లు వాయిదా పడటం వల్ల కొంత ఇంప్యాక్ట్ ఉంది. అంతేకాదు సినిమా టీజర్, ట్రైలర్ ఇవేవి సినిమా మీద ఆసక్తి కలిగించలేదు. మరోపక్క సితార నిర్మాత నాగ వంశీ ఈ సినిమా గురించి ఎంత పాజిటివ్ గా చెప్పినా ఆడియన్స్ లో అటెన్షన్ రావట్లేదు.

సినిమా రిలీజ్ కు ముందు సాంగ్స్ ఆడియన్స్ కి ఎక్కితే సగం పని అయినట్టే ఈ సినిమా విషయంలో ఆ మ్యాజిక్ కూడా వర్క్ అవుట్ కాలేదు. జి వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేదు. తొలి సినిమా ఉప్పెనతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోగా వైష్ణవ్ తేజ్ కొద్దిపాటి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకున్న శ్రీ లీల ఈ సినిమాతో కూడా ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తుంది. కానీ సినిమాకు అసలేమాత్రం బజ్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సితార బ్యానర్ నుంచి ఈమధ్యనే మ్యాడ్ సినిమా వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఆ సినిమా తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఆదికేశవ వస్తుంది.

ఈ సినిమాపై హీరో వైష్ణవ్ తేజ్ అయితే భారీ హోప్స్ పెట్టుకున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైం కమర్షియల్ సినిమా చేసిన వైష్ణవ్ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. రిలీజ్ ముందు సరైన బజ్ లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత అయినా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. రిలీజ్ కు వారం ఉంది కాబట్టి ఈ వారం రోజులు వరుస ప్రమోషన్స్ చేసి సినిమాపై బజ్ పెంచితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. సినిమాలో కాస్త మ్యాటర్ ఉన్నా హిట్ చేసేందుకు మెగా ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. మరి ఆదికేశవ మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.