Begin typing your search above and press return to search.

#సిన్.. ఈ బ్యూటీని చూస్తే పాపం త‌గులును!

జెన్నిఫ‌ర్ వేడెక్కించే అందాలు ఇన్ స్టా మాధ్య‌మంలోను స్పెష‌ల్ ట్రీట్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Feb 2024 11:30 PM GMT
#సిన్.. ఈ బ్యూటీని చూస్తే పాపం త‌గులును!
X

అక్షయ్ కుమార్ `రామ్ సేతు` చిత్రంలో న‌టించింది బ్రెజిలియ‌న్ మోడ‌ల్ జెన్నిఫ‌ర్ పిసినాటో. `ఆహా` తెలుగు వెబ్ సిరీస్ `సిన్`లోను వేడెక్కించే పాత్ర‌తో తెలుగు యువ‌త‌కు చేరువైంది. జెన్నిఫ‌ర్ వేడెక్కించే అందాలు ఇన్ స్టా మాధ్య‌మంలోను స్పెష‌ల్ ట్రీట్ గా మారుతున్నాయి. ఈ భామ తాజా ఫోటోషూట్ ఇప్పుడు వెబ్ లో వైర‌ల్ గా మారుతోంది.


జెన్నిఫ‌ర్ వైట్ అండ్ వైట్ లుక్ లో క‌నిపిస్తోంది. తెల్ల చీర‌లో దేవ‌తా సుంద‌రిని త‌ల‌పించే అందంతో క‌వ్విస్తోంది. ఒక అంద‌మైన జ‌ల‌పాతం ముందు జెన్నిఫర్ ఫోటోషూట్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షిస్తోంది. బాల్యం నుంచి మోడ‌ల్ గా రాణించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం సినీరంగంలో పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. తెలుగు-హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఈ బ్యూటీ వెబ్ సిరీస్ ల‌లో రాణిస్తోంది.

జెనిఫర్ పిసినాటో అక్షయ్ కుమార్ నటించిన `రామ్ సేతు`లో జియాలజిస్ట్ - డాక్టర్ గాబ్రియెల్ పాత్రలో న‌టించింది. దీనికి చాలా సానుకూల స్పందనను పొందింది. మోడ‌ల్ గా న‌టిగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ బ్యూటీ గజరాజ్ రావు -మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు నటించిన `థాయ్ మసాజ్`లోను న‌టించింది. ఈ వెబ్ సిరీస్ కి 6.2/10 రేటింగ్ ఐఎండిబిలో ఉంది.