Begin typing your search above and press return to search.

విశ్వక్ తో ఐటెం సాంగ్.. ఈషా కాదు.. ఆ బిగ్ బాస్ బ్యూటీనే

సొంత బ్యానర్‌ ను ప్రారంభించి తన సినిమాలను తానే నిర్మించుకున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 9:51 AM GMT
విశ్వక్ తో ఐటెం సాంగ్.. ఈషా కాదు.. ఆ బిగ్ బాస్ బ్యూటీనే
X

యంగ్ హీరో విశ్వక్ సేన్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. మాస్ దా దాస్ అనిపించుకున్నారు. కొన్ని సినిమాల అనుభవమే ఉన్నా.. నిర్మాతగా కూడా మారారు. సొంత బ్యానర్‌ ను ప్రారంభించి తన సినిమాలను తానే నిర్మించుకున్నారు. ఇక ఓ మూవీకి దర్శకుడిగా, రచయితగా కూడా వ్యవహరించారు. అలా మల్టీ టాలెంటెడ్ గా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.


అందులో ఒకటైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ఉన్నట్లు గతకొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు అందం ఈషా రెబ్బా.. విశ్వక్ సేన్ తో చిందులు వేసినట్లు వార్తలు వచ్చాయి.

విశ్వక్ సేన్- ఈషా రెబ్బా సాంగ్ బాగా వచ్చిందని, ఇద్దరు అదరగొట్టేశారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఈషా రెబ్బా చేయలేదట. ఇటీవలే హిందీ బిగ్ బాస్ లో పాల్గొన్న నటి అయేషా ఖాన్ చేసిందట. ఈ సాంగ్ షూటింగ్ నిన్న రాత్రే కంప్లీట్ అయిందట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. అయేషానే ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేసింది.

అందులో పక్కా మాస్ మసాలా గెటప్ లో ఉందీ అమ్మడు. ఈ బ్యూటీ.. 2022లో రిలీజైన ముఖచిత్రం సినిమాలో కీలక పాత్ర పోషించింది. విశ్వక్- ఆయేషా సాంగ్ అద్భుతంగా వచ్చిందట. టాలీవుడ్ టాప్ ఐటెం సాంగ్ కానుందట. సంక్రాంతి సినిమాల్లో ఐటెం సాంగ్ లేని లోటు.. ఈ సాంగ్ తో తీరనుందట.

ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్‌తో పాటు సుట్టంలా సూసి అనే ఫ‌స్ట్ సింగిల్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ, సౌజన్య నిర్మిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లను మేకర్స్ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.