Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్పై బ్యూటీ కవ్వింపులు

మినీ షార్ట్‌ లో లైట్ పింక్ టాప్ లో ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడి షో ఓ రేంజ్ లో ఉంది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 4:10 AM GMT
పిక్ టాక్ : స్పై బ్యూటీ కవ్వింపులు
X

తమిళనాడుకు చెందిన ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ వరుస సినిమాలతో కెరీర్‌ లో దూసుకు పోతుంది. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెల్సిందే.


తాజాగా ఈ అమ్మడు స్పై సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడికి టాలీవుడ్ లో ముందు ముందు భారీ ఆఫర్లు రావచ్చు అంటూ టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా ఈ అమ్మడు తమిళ్ తో పాటు తెలుగులో కూడా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హీరోయిన్‌ గా ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు చేసిన అందాల ఆరబోత ఫోటో షూట్స్ వైరల్‌ అవుతున్నాయి. నడుము అందం చూపిస్తూ థైస్ ను ఎక్స్‌ పోజ్‌ చేస్తూ కవ్విస్తూ ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చింది.

మినీ షార్ట్‌ లో లైట్ పింక్ టాప్ లో ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడి షో ఓ రేంజ్ లో ఉంది. ఇలాంటి కవ్వింపు ఫోటో షూట్స్ తో ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని సినిమాల్లో ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌ లో జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటే మోస్ట్‌ వాంటెడ్ టాప్ స్టార్‌ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.