పిక్‌టాక్ : అందాల నడుముతో ఐశ్వర్యం
వెండి తెరపై సందడి చేస్తున్న అందాల ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలోనూ రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 14 July 2025 10:56 AM ISTతమిళ్ మూవీ 'కాదలిల్ సోధపువదు యెప్పాడి'తో 2012లో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్. తమిళనాడులో పుట్టిన ఈ అమ్మడు తమిళ సినిమాలతో పాటు కన్నడ, మలయాళం, తెలుగు సినిమాలను కూడా చేసింది. తెలుగులో ఈ అమ్మడు చేసిన గూఢచారి, భజే వాయు వేగం సినిమాలు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. కానీ ఈమె దృష్టి ఎక్కువగా కోలీవుడ్ మీదే ఉంది. ప్రస్తుతం తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే తెలుగులోనూ సినిమాకు కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెండి తెరపై సందడి చేస్తున్న అందాల ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలోనూ రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగానే ఐశ్వర్య మీనన్ ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నడుము అందం చూపిస్తూ, నాభి అందాలతో చూపు తిప్పనివ్వకుండా చేస్తున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్లీవేజ్ షో తో మతి పోగొడుతున్న ఈ అమ్మడి ఫోటోలను చూసిన నెటిజన్స్ చాలా మంది ఇంతటి అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదని, రావాల్సిన గుర్తింపు రావడం లేదు అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈమె షేర్ చేసిన ఫోటోల్లో ఈ ఫోటోలు బెస్ట్ అని ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో హీరోయిన్స్ అంతా కూడా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే అందంతో కట్టిపడేస్తూ ఉంటారు. అలాంటి అందం ఈ అమ్మడిది అనడంలో సందేహం లేదు. ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ప్రతి ఫోటో కూడా నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. నడుము అందం, నాభి అందం చూపించడంతో పాటు క్లీవేజ్ షో చేయడం మాత్రమే కాకుండా క్యూట్‌గా అందమైన ఫోజ్‌లు ఇవ్వడం వల్ల కూడా ఈ ఫోటోలు నెట్టింట అంతగా వైరల్ అవుతున్నాయి. ఈ రేంజ్ అందంగా ఉండటం వల్లే హిట్స్ పడకున్నా ఈ అమ్మడు ఇండస్ట్రీలో నెట్టుకు వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కేరళలోని చెందమంగళంకు చెందిన కుటుంబంకు తమిళనాడులోని ఈరోడ్‌లో ఐశ్వర్య మీనన్ జన్మించింది. విద్యాభ్యాసం ఈరోడ్‌లోని వెల్లలార్ మెట్రిక్యులేషన్ లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ను ఎస్‌ఆర్‌ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేసింది. ఎంఎస్ రమేష్ దర్శకత్వం వహించిన దశావాలా చిత్రంతో కన్నడ పరిశ్రమలో అడుగు పెట్టింది. ప్రేమ్ సరసన ఆ సినిమాలో నటించింది. ఆ సినిమాలో మానసిక వికలాంగురాలిగా నటించడం ద్వారా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆపిల్ పెన్నే అనే తమిళ సినిమాలోనూ నటించడం ద్వారా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఐశ్వర్య కూతురుగా నటించగా, రోజా ఆ సినిమాలో తల్లి పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలోని అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితురాలు గా మారింది.
