Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ కి ఈసినిమా బ‌యోపిక్ లా ఉందా!

తాజాగా ముంబైలో నిర్వ‌హించిన ఓ టీటీ ఇండియా పెస్ట్ లో కొంత మంది న‌టీన‌టులు పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2023 12:30 AM GMT
స్టార్ కిడ్ కి ఈసినిమా బ‌యోపిక్ లా ఉందా!
X

బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ` ది ఆర్చిస్` తో తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో సుహానా ప్రేక్ష‌కాభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. సినిమాలో వారి పాత్ర‌ల‌కు సంబంధించిన ఫోటోల్ని మేక‌ర్స్ రిలీజ్ చేసారు. తాజాగా ముంబైలో నిర్వ‌హించిన ఓ టీటీ ఇండియా పెస్ట్ లో కొంత మంది న‌టీన‌టులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సుహానా త‌న పాత్ర గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. చిత్రీక‌ర‌ణ ప్రారంభానికి ముందు నుంచే సెల్ప్ ట్రైనింగ్ మొద‌లు పెట్టాను. షూటింగ్ మొద‌లు కావ‌డానికి ఆరు నెల‌లు ముందు నుంచే మా ట్రైనింగ్ ప్రారంభ‌మైంది. స్కేటింగ్ స‌న్నివేశాల కోసం చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ప్ర‌తీ స‌న్నివేశం ఎంతో ప్రేమించి చేసాను. సినిమాలో వెరోనికా పాత్ర పోషించా. నా నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్న పాత్ర అది.

వ్య‌క్తిగ‌తంగా నేను ధ‌రించే దుస్తులు ఆ పాత్ర‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ఇది నాకెంతో ఆశ్య‌ర్యాన్ని చ్చింది. ద‌ర్శ‌కురాలు జోయా కూడా ఆ డ్రెస్ బాగుంద‌నేవారు. ఫ‌లానా స‌న్నివేశానికి ఆ డ్రెస్ బాగుంటుంది వేసుకో అని స‌ల‌హాలు ఇచ్చేవారు. ది ఆర్చిస్ తో న‌టిగా చాలా విష‌యాలు తెలుసుకున్నాను. నాదికి ప‌ర్పెక్ట్ డెబ్యూగా భావిస్తున్నాను` అంది. ఇదే చిత్రంతో ఖుషీ క‌పూర్.. అమితాబ‌చ్చ‌న్ మ‌న‌వ‌డు అగ‌స్త్య నందతో పాటు ప‌లువురు స్టార్ కిడ్స్ ప‌రిచ‌యం అవుతున్నారు.

అన్ని ప‌నులు పూర్తి చేసి డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌చారం పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ కిడ్స్ ని రిలీజ్ కి ముందే మీడియా ఇంట‌ర్వ్యూల‌తో బాగా పాపుల‌ర్ చేస్తున్నారు. ఇప్ప‌టికే వాళ్లంతా ఇన్ స్టాలో భారీగా ఫాలోయింగ్ ఉన్న వారు. వ్య‌క్తిగ‌తంగా ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉన్నారు.