Begin typing your search above and press return to search.

రాజమౌళి తర్వాత మహేష్ ప్లాన్ అదేనా..?

అతడు, ఖలేజా సినిమాలు చేసిన ఈ ఇద్దరు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ గుంటూరు కారం తో మరోసారి అదరగొట్టారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 1:30 AM GMT
రాజమౌళి తర్వాత మహేష్ ప్లాన్ అదేనా..?
X

కొన్ని కాంబినేషన్స్ ఎన్నిసార్లు కలిసి పనిచేసినా ఆడియన్స్ కు ఫ్యాన్స్ కు అదో స్పెషల్ ట్రీట్ అన్నట్టే ఉంటుంది. టాలీవుడ్ లో అలాంటి క్రేజీ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అలాంటి కంబోలో ఒకటి త్రివిక్రం, మహేష్. అతడు, ఖలేజా సినిమాలు చేసిన ఈ ఇద్దరు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ గుంటూరు కారం తో మరోసారి అదరగొట్టారు. త్రివిక్రం సినిమా ఎప్పుడు చేసినా మహేష్ కొత్తగా కనిపిస్తాడు. అది చేసిన 3 సినిమాల్లో ప్రూవ్ అయ్యింది. గుంటూరు కారం లో తమణ పాత్రలో సరికొత్త మహేష్ కనిపించాడు.

ముఖ్యంగా డైలాగులు, యాక్షన్ మాత్రమే కాదు ఈసారి డాన్స్ లతో కూడా దుమ్ము దులిపేశాడు. అందుకే త్రివిక్రమ్ మహేష్ కాంబో సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఒక క్రేజ్ ఉంటుంది. గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కాగా త్వరలోనే సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ మొదలవుతుందని తెలుస్తుంది.

రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ మళ్లీ త్రివిక్రమ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలం గ్యాప్ తీసుకున్న ఈ ఇద్దరు ఈసారి అంత గ్యాప్ లేకుండా జక్కన్న సినిమా పూర్తి కాగానే సినిమా చేయాలని అనుకుంటున్నారట.

గుంటూరు కారం తర్వాత మహేష్ అల్లు అర్జున్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. ఇక ఈ మూవీ తర్వాత మరోసారి త్రివిక్రమ్, మహేష్ కలిసి పనిచేస్తారని తెలుస్తుంది. త్రివిక్రమ్ తో సినిమా అంటే మహేష్ ఎప్పుడు రెడీ అనేస్తాడు. గుంటూరు కారం సక్సెస్ ఈ కాంబోపై క్రేజ్ మరింత పెంచేసింది. రాజమౌళి సినిమా అది రెండు మూడేళ్లు పట్టినా మహేష్ 29వ సినిమా తర్వాత 30వ సినిమా మాత్రం త్రివిక్రమ్ తోనే ఫిక్స్ అని ఫిల్మ్ నగర్ టాక్. అల్లు అర్జున్ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమా పూర్తి కాకపోతే ఈలోగా పవన్ తో సినిమా చేసి ఆ తర్వాత మహేష్ కోసం రెడీగా ఉంటాడు త్రివిక్రమ్. సూపర్ హిట్ కాంబో కాబట్టి ఈ కలయిక ఎప్పటికీ స్పెషలే అని చెప్పొచ్చు.