Begin typing your search above and press return to search.

గ్లోబల్ మార్కెట్ లో పుష్ప క్రేజ్ పెరుగుతుందా?

ఒక్క రీజనల్ మూవీతోనే టాలీవుడ్ కు నేషనల్ అవార్డు తీసుకురావడం అల్లు అర్జున్ కే సాధ్యమైంది.

By:  Tupaki Desk   |   18 Feb 2024 2:45 AM GMT
గ్లోబల్ మార్కెట్ లో పుష్ప క్రేజ్ పెరుగుతుందా?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప మూవీతో తన స్టార్ డమ్ ను ఒక్కసారిగా పెంచుకున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క రీజనల్ మూవీతోనే టాలీవుడ్ కు నేషనల్ అవార్డు తీసుకురావడం అల్లు అర్జున్ కే సాధ్యమైంది. ప్రస్తుతం బన్నీ.. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు.

ఇండియన్ సినిమా తరపున ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో పుష్ప సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహకులు. దీంతో ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప సందడి జోరుగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ తో కలిసి హాలీవుడ్ స్టార్స్ కూడా తగ్గేదేలే అంటూ డైలాగ్ చెప్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పుష్ప ఫ్రాంఛైజీగా మారే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు బన్నీ.

ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న అల్లు అర్జున్.. పలువురు ఇంటర్నేషనల్ మేకర్స్, నిర్మాతలు, గ్లోబల్ మార్కెట్ బయర్స్ తో చర్చించనున్నారు. అంతర్జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. ఇప్పటికే రష్యా, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో పుష్ప-1 సూపర్ హిట్ సాధించడంతో పుష్ప ఫ్రాంఛైజీపై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక బన్నీ మీటింగ్స్, ఇంటర్వ్యూలతో పుష్ప ఫ్రాంఛైజీపై మరింత హైప్ క్రియేట్ అవ్వనుందని సినీ పండితులు చెబుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ తోపాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న పుష్ప-2 ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గ్లోబల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పుష్ప-2 పై అంచనాలు ఓ రేంజ్ కు చేరుకుంటాయని అంటున్నారు.

మరోవైపు, సుకుమార్ కూడా పుష్ప-2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క విషయంలో దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఆడియన్స్ కు బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. కొన్ని సీన్లు రీ షూట్ కూడా చేశారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇటీవల గంగమ్మ జాతర లాంగ్ షెడ్యూల్ ను మేకర్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.