Begin typing your search above and press return to search.

ఆ మెగా హీరో మూవీ కూడా వాయిదానా?

భారత వైమానిక దాడులకు సంబంధించి కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 10:54 PM IST
ఆ మెగా హీరో మూవీ కూడా వాయిదానా?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. వైమానిక దాడులు దేశభక్తి కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్లోకి ఆరంగేట్రం చేస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. భారత వైమానిక దాడులకు సంబంధించి కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి తరుణంలో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడబోతున్నట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో సర్క్యూ లేట్ అవుతుంది. అసలైతే గత డిసెంబర్ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.

మొదట డిసెంబర్ 8న ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేశారు. సరిగ్గా అదే సమయంలో యానిమల్, హాయ్ నాన్న సినిమాలతో పాటూ సలార్ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ కి ఉండటంతో ఆపరేషన్ వాలెంటైన్ ని ఫిబ్రవరి కి పోస్ట్ పోన్ చేశారు.ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నట్లు తెలిసింది. ఈరోజు తెలుగు ఫిలిం చాంబర్లో రవితేజ 'ఈగల్' కి రిలీజ్ డేట్ ఇవ్వాలనే విషయంపై చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ 'ఊరు పేరు బైరవకోన' సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకోవాలని నిర్మాతలకు కోరగా తమకు సోలో రిలీజ్ డేట్ ఇస్తే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తామని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. దాంతో ఊరి పేరు భైరవకోన నిర్మాతలకు ఫిబ్రవరి 16వ తేదీన సూచించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 16న మరే సినిమా విడుదల కాదని ఫిలిం ఛాంబర్ తెలపడంతో నిర్మాతలు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కానీ మరో విషయం ఏంటంటే, అదే ఫిబ్రవరి 16న వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడేమో ఫిబ్రవరి 16న ఎలాంటి సినిమాలు రావడం లేదని తెలుగు ఫిలిం చాంబర్ తెలిపింది. దీంతో 'ఆపరేషన్ వాలెంటైన్' మళ్లీ వాయిదా పడుతుందనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోసారి పోస్ట్ పోన్ కి 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ టీమ్ ఒప్పుకుంటారా? లేదా? అనేది చూడాలి.