Begin typing your search above and press return to search.

2024 లో కూడా ఆమెనే బోణి కొట్టబోతోందా?

రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతున్న దీపికా పదుకొనే ఒక్కో సినిమాకి 15 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 3:30 AM GMT
2024 లో కూడా ఆమెనే బోణి కొట్టబోతోందా?
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ప్రభాస్ 'కల్కి' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ ఏడాది బాలీవుడ్ లో రెండు భారీ హిట్స్ కూడా అందుకుంది. ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతున్న దీపికా పదుకొనే ఒక్కో సినిమాకి 15 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటోంది.

ఇండియాలో ఈ రేంజ్ రెమ్యునేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ కూడా ఈమెనే కావడం విశేషం. ఇక 2023లో దీపిక షారుక్ ఖాన్ సరసన పఠాన్, జవాన్ వంటి సినిమాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. వీటిలో పఠాన్ 2023 జనవరి 25న విడుదలైంది. ఈ ఇయర్ బాలీవుడ్ లో ఫస్ట్ సక్సెస్ అందుకున్న సినిమా ఇదే. దాంతో 2023లో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ అనిపించుకుంది దీపికా పదుకొనే.

అయితే 2024 లో కూడా దీపిక ఇదే రిపీట్ చేయబోతోంది. 2024 ఆరంభంలో దీపికా పదుకొనే నటించిన సినిమానే బాక్స్ ఆఫీస్ వద్ద బోణి కొట్టబోతోంది. 2024 జనవరిలో బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో బాలీవుడ్ నుంచి కొత్త ఏడాదిలో విడుదలవుతున్న మొదటి సినిమా 'ఫైటర్'. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమాలో దీపిక పదుకొనే ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.

ఈ ఏడాది రిపబ్లిక్ డే కి 'పఠాన్' తో సక్సెస్ అందుకున్న దీపిక వచ్చే ఏడాది అదే రిపబ్లిక్ డే రోజున 'ఫైటర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులో షారుక్ ఖాన్ హీరో అయితే ఇందులో హృతిక్ రోషన్ హీరో. అయితే రెండు సినిమాల్లో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్, హీరోయిన్ దీపికా పదుకొనే మాత్రం కామన్. కాగా ఫైటర్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకుకున్నాయి.

ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే మళ్లీ కొత్త ఏడాదిలో బాలీవుడ్ నుంచి తొలి హిట్ దీపిక పదుకొనే ఖాతాలోనే పడేట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో దీపిక ఎయిర్ ఫోర్స్ ఈ చెందిన వార్ పైలట్ గా కనిపించనుంది. సినిమాలో ఓ వైపు గ్లామర్ వలకబోస్తూనే మరోవైపు సోల్జర్ గా భారీ విన్యాసాలు చేయబోతుంది. ఫైటర్ కూడా సక్సెస్ అయితే బాలీవుడ్ లో వరుసగా రెండేళ్లు ఈ హీరోయిన్ దే హవా అని చెప్పొచ్చు.