Begin typing your search above and press return to search.

మేకర్స్ లో ఆ భయం పోలేదా..?

అయితే థియేటర్లు ఓపెన్ అయ్యాక డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లు చాలా వరకు తగ్గినా కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ పై ఇంకా ఆశలు వదులుకోలేదు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 5:36 AM GMT
మేకర్స్ లో ఆ భయం పోలేదా..?
X

కొవిడ్ టైంలో థియేటర్లు మూత పడటం వల్ల సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అప్పటి నుంచి థియేట్రికల్ బిజినెస్ సరిగా లేకపోయినా ఓటీటీ రైట్స్ భారీగా వచ్చిన సరే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే థియేటర్లు ఓపెన్ అయ్యాక డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లు చాలా వరకు తగ్గినా కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ పై ఇంకా ఆశలు వదులుకోలేదు. సెట్స్ మీద ఉన్న చిన్న లేదా మీడియం బడ్జెట్ సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసేలా ఓటీటీ సంస్థలు మేకర్స్ ని అడుగుతున్నారు. ఎవరైనా థియేట్రికల్ రిలీజ్ రిస్క్ అనుకున్న వారు వచ్చిన ఓటీటీ ఆఫర్ కు ఓకే అని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు.


తెలుగులో ఇలా డైరెక్ట్ డిజిటల్ అయ్యే సినిమాల సంఖ్య చాలా తక్కువ కానీ కోలీవుడ్ లో మాత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ల హంగామా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా కీర్తి సురేష్, జయం రవి నటించిన సైరెన్ సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. కీర్తి సురేష్ లాంటి లీడింగ్ హీరోయిన్, జయం రవి లాంటి హీరో ఉన్న సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. సైరెన్ సినిమాలో కీర్తి సురేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఈ సినిమాలో జయం రవి డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారు. సైరెన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ కూడా బాగానే అనిపించింది.

థియేట్రికల్ బిజినెస్ కాలేదో మరే కారణంలో కానీ ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. జీ 5 ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తుంది. జనవరి 26న ఈ సినిమా జీ 5లో వస్తుంది. సినిమాలో కీర్తి సురేష్ తో పాటుగా అనుపమ పరమేశ్వరన్ కూడా నటించింది. జయం రవి, కీర్తి సురేష్, అనుపమ ఇలా భారీ స్టార్ కాస్ట్ ఉన్నా కూడా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అవ్వడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

అయితే సినిమా ట్రైలర్ చూశాక రిలీజ్ ఎప్పుడు అనుకున్న ఆడియన్స్ కి ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అని తెలిసి సంతోషిస్తున్నారు. ఎలాగు ఓటీటీ రిలీజ్ అంటే ఫ్రీగా చూసేయొచ్చు అనే భావన ఆడియన్స్ లో ఉంది. స్టార్ సినిమాలకు ఓకే కానీ మామూలు సినిమాలకు థియేటర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే కొందరు మేకర్స్ కేవలం ఓటీటీ రిలీజ్ సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే డిజిటల్ రిలీజ్ ల వల్ల లాభాలు వచ్చే సినిమాలనే వారు తీస్తున్నారని చెప్పొచ్చు. మరి సైరెన్ తో డిజిటల్ రిలీజ్ కాబోతున్న కీర్తి సురేష్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.