Begin typing your search above and press return to search.

మ‌లైకా వార‌సుడు గిటారిస్టా హీరోనా?

ఆర్భాజ్ కుమారుడు అర్హాన్ ఖాన్ పెళ్లి వేడుక‌లో ఎంట‌ర్ టైన్ చేస్తూ గిటార్ ప్లే చేస్తున్న వీడియో ఇంట‌ర్నెట్ లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

By:  Tupaki Desk   |   27 Dec 2023 2:45 AM GMT
మ‌లైకా వార‌సుడు గిటారిస్టా హీరోనా?
X

అర్బాజ్ ఖాన్ - మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ ఆక‌స్మిక వివాహం ఇప్ప‌డు బాలీవుడ్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్. ఈ వివాహానికి సంబంధించిన వైర‌ల్ ఫోటోల్లో అనూహ్యంగా ఒక రాకుమారుడి (ప్రిన్స్) గురించి కొత్త విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆర్భాజ్ కుమారుడు అర్హాన్ ఖాన్ పెళ్లి వేడుక‌లో ఎంట‌ర్ టైన్ చేస్తూ గిటార్ ప్లే చేస్తున్న వీడియో ఇంట‌ర్నెట్ లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఈ వీడియోలో కుమారుడు అర్హాన్ గిటార్ వాయిస్తూ ఉంటే ఆర్భాజ్ తన పెర్ఫామెన్స్‌ను ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నాడు. ఈ వీడియోను అర్బాజ్ బావ అతుల్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తండ్రీకొడుకులను ట్యాగ్ చేస్తూ, `ఐ లవ్ యూ పాపా` అని క్యాప్షన్ పెట్టారు.

అర్హాన్ వీడియోపై కొంద‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అత‌డు గిటారిస్టా? కాబోయే హీరోనా? అని ప్ర‌శ్నించారు. అర్హాన్ లుక్స్ బ్యాక్ గ్రౌండ్ ని బ‌ట్టి అత‌డు హీరో అవ్వ‌డం గ్యారెంటీ అని అంచ‌నా వేస్తున్నారు. స‌ల్మాన్ అండ‌దండ‌ల‌తో ఆర్భాజ్ వార‌సుడు పెద్ద హీరోగా ఎదిగేందుకు ఆస్కారం ఉంది. అయితే అత‌డు ప్ర‌తిభతో నిరూపించి, లెగ‌సీని ముందుకు న‌డిపించాల్సి ఉంటుంది.

అర్బాజ్ ఖాన్ గతంలో మలైకా అరోరాను వివాహం చేసుకున్నాడు. 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు ప‌లుకుతూ ఈ జంట‌ విడాకులు తీసుకోవ‌డం అంద‌రికీ షాకిచ్చింది. ఈ దంపతులు 2017లో విడాకులు తీసుకున్నారు. వారు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కుమారుడు అర్హాన్‌కు సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు.

అర్బాజ్ ఖాన్ త‌న వివాహానికి సంబంధించిన ఫోటోల‌తో పాటు, తన కుటుంబ స‌భ్యుల‌తో సంతోషకరమైన వేడుక‌కు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసాడు. దీనికి ఇచ్చిన‌ క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంది. ``సంతోషకరమైన కుటుంబం .. మునుపటి స్వర్గం`` అని ఆర్భాజ్ ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ఈ ఆల్బమ్‌లో అర్బాజ్ ఖాన్ తో పాటు త‌న సోద‌రులు సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్ కూడా ఉన్నారు. ``ఇది మీరే. ఇది నేనే. ఇది మేము`` అంటూ ఆర్భాజ్ ఎంతో జోష్ ఫుల్ కోట్స్ రాశారు. ఇంత‌లోనే అర్బాజ్ ఖాన్ - షురా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో త‌మ వివాహం గురించి అధికారికంగా తెలియజేసారు. ``మా ప్రియమైన వారి సమక్షంలో జీవితకాలం ప్రేమను అంద‌మైన‌ కలయికను ఈ రోజు నుండి ప్రారంభిస్తాము! మీ అందరి ఆశీస్సులు శుభాకాంక్షలు కావాలి`` అని రాసారు.

అర్బాజ్ ఖాన్ బాలీవుడ్ లో న‌టుడు కం నిర్మాత‌. త‌న‌ సోదరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన దబాంగ్ సిరీస్ చిత్రాలను నిర్మించాడు. అతడి ఫిల్మోగ్రఫీలో `ప్యార్ కియా తో డర్నా క్యా`, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు ఉన్నాయి. అర్బాజ్ ఖాన్ నటుడిగా రాణించాడు. కానీ సినిమా నిర్మాతగా విజ‌యాలు సాధించాడు. అత‌డు `ఇన్విన్సిబుల్స్` అనే చాట్ షోను కూడా హోస్ట్ చేస్తున్నాడు.