Begin typing your search above and press return to search.

చంద‌మామ గ్లామ‌ర్ షో కుర్రాళ్ల కోస‌మా?

అయితే ఇలా ఎలివేష‌న్లు ఇవ్వ‌డం కేవ‌లం ఇన్ స్టా ఆదాయం కోసం మాత్ర‌మే అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే అన్న‌ది తాజా మాట‌.

By:  Tupaki Desk   |   21 Oct 2023 12:30 AM GMT
చంద‌మామ గ్లామ‌ర్ షో కుర్రాళ్ల కోస‌మా?
X

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ వ‌రుస‌గా సీనియ‌ర్ హీరోల‌తోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తుంది. చిరంజీ వి..బాల‌య్య‌..క‌మ‌ల్ హాస‌న్..ర‌జ‌నీకాంత్ అంటూ 60 ప్ల‌స్ హీరోల స‌ర‌స‌న ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. సీనియ‌ర్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ ఛాయిస్ కావ‌డంతో కాజల్ మాత్ర‌మే మేకర్స్ ఆప్ష‌న్ కావ‌డంతో ఆమెని ఎంపిక చేస్తున్నారు. ఓర‌కంగా కాజ‌ల్ ల‌క్కీనే. ఫేడౌట్ అయిపోయింద‌నుకున్న భామ ఇలా సీనియ‌ర్ల‌తో య‌మా బిజీగా ఉంది.

కెరీర్ ఆరంభంలో మ‌హేష్‌..ప్ర‌భాస్..ఎన్టీఆర్ లాంటి హీరోల‌తో రొమాన్స్ చేసినా ఆ త‌ర్వాత గ్రాప్ ప‌డిపోవ డంతో వాళ్ల‌తో న‌టించే అవ‌కాశాలు రాలేదు. ఈ క్ర‌మంలో పెళ్లి..పిల్ల‌లు ఇలా జీవితంలో చాలా ర‌కాల మార్పులొచ్చాయి. ఆ మార్పుల‌కు త‌గ్గ‌ట్టే ఇప్పుడు సీనియ‌ర్ల‌తో రొమాన్స్ చేస్తుంది. అయితే అమ్మ‌డు నెట్టింట మాత్రం గ్లామ‌ర్ ట్రీట్ త‌గ్గ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు డిజైన‌ర్ దుస్తుల్లో..అగ్గి రాజేసే అందాల‌తో ఆక‌ట్టు కునే ప్ర‌య‌త్నం నిరంత‌రం జ‌రుగుతూనే ఉంది.

అయితే ఇలా ఎలివేష‌న్లు ఇవ్వ‌డం కేవ‌లం ఇన్ స్టా ఆదాయం కోసం మాత్ర‌మే అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే అన్న‌ది తాజా మాట‌. టైర్ -2 హీరోల‌తో ఛాన్సులు ద‌క్కించుకోవ‌డం కోసం అమ్మడిలా అప్పుడ‌ప్పుడు ఇన్ స్టాని హీటెక్కిస్తుంద‌ని అంటున్నారు. కొత్త కుర్రాళ్ల‌తో అవ‌కాశాలు రావాల‌న్నా ఫాలోయింగ్ ఉండాలి. అది ఇన్ స్టాతోనే సాధ్యం కాబ‌ట్టి వ‌య‌సు త‌ర‌గ‌ని వ‌న్నెలా స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా ఇన్ స్టాలో చెక్కుకుం టుంద‌ని తెలుస్తోంది.

ఇన్ స్టా ఆదాయం కంటే ఒక సినిమాకి సైన్ చేస్తే వ‌చ్చే ఆదాయం మూడింత‌లు ఉంటుంది. అదే సినిమా హిట్ అయితే మ‌రో రెండు..మూడు సినిమాల‌కు వ‌రుస పెట్టి చేసే అవ‌కాశం ఉంటుంది. అలాంట‌ప్పుడు ఏ న‌టైనా త‌న‌ని తాను మౌల్డ్ చేసుకోవ‌డంలో త‌ప్పేముంది. ప్ర‌స్తుతం చంద‌మామ ఆ ప‌నిలోనే బిజీగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం `ఇండియ‌న్-2`..స‌త్య‌భామ‌తో పాటు హిందీలోనూ ఓ లేడీ ఓయెంటెడ్ సినిమా చేస్తుంది.