Begin typing your search above and press return to search.

స‌మంత టైమ్ కూడా స్వీటీ లాగే న‌డుస్తోందా?

దీంతో అమ్మ‌డు బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి పెట్టింద‌ని..ఇక‌పై అదే ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతుంద‌ని..అక్క‌డే స్థిర‌ప‌డిపోతుంద‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   4 April 2024 11:30 AM GMT
స‌మంత టైమ్ కూడా స్వీటీ లాగే న‌డుస్తోందా?
X

విరామం అనంత‌రం స‌మంత టాలీవుడ్ లో కొత్త సినిమాల‌కు సైన్ చేసింది లేదు. బాలీవుడ్ లో మాత్రం కొన్ని ప్రాజెక్ట్ ల‌తో ముందుకెళ్తుంది. దీంతో అమ్మ‌డు బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి పెట్టింద‌ని..ఇక‌పై అదే ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతుంద‌ని..అక్క‌డే స్థిర‌ప‌డిపోతుంద‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. మ‌కాం హైద‌రాబాద్ నుంచి ముంబైకి మార్చేసింద‌ని వెలుగులోకి వచ్చింది. ఇదంతా నిజ‌మా? కాదా? అని తెలియడానికి ఇంకాస్త స‌మ‌యం ప‌డుతుంది.

ఇదంతా ప‌క్క‌న‌బెట్టి చూస్తే! అస‌లు స‌మంత‌కి తెలుగు అవ‌కాశాలున్నా న‌టించ‌డం లేదా? అస‌లు అవ‌కాశాలే రాక న‌టించ‌లేదా? అన్న కొత్త సందేహం తెరపైకి వ‌స్తుంది. టాలీవుడ్ లో స‌మంత ప్ర‌యాణం కూడా స్వీటీ అనుష్క‌లాగే న‌డుస్తుందా? అంటే దాన్ని కాద‌న‌డానికి లేద‌నిపిస్తుంది. తొలుత అనుష్క విషయంలో కూడా ఇలాంటి ప్ర‌చార‌మే తెర‌పైకి వ‌చ్చింది. తెలుగు అవ‌కాశాలు వ‌స్తున్నా? ఆమె కావాల‌నే న‌టించ‌లేద‌ని మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

ఆ త‌ర్వాత కొన్ని నెల‌ల‌కే స‌న్నివేశం అర్ద‌మైంది. ఇక్క‌డ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో మాలీవుడ్ వైపు చూసింద‌ని. తాజాగా స‌మంత విష‌యంలో ఇదే రూల్ అప్లై చేసి చూస్తే? ఇందులో వాస్తవం లేదా? అన్న సందేహం రాక మాన‌దు. అనుష్క కంబ్యాక్ త‌ర్వాత తెలుగులో ఒక‌టి..రెండు సినిమాల‌కు క‌మిట్ అయింది. అదే స‌మ‌యంలో మాలీవుడ్ లో లాంచ్ కి రెడీ అయింది. అలాంట‌ప్పుడు అనుష్క‌కి టాలీవుడ్ లో కొత్త అవ‌కాశాలు వ‌స్తే ఎందుకు వ‌దులుకుంటుంది? కోట్ల రూపాయాల పారితోషికం ఏమైనా న‌టికి చేదా? ఇప్పుడు స‌మంత తీరు కూడా అనుష్క‌కి స‌మాంత‌రంగానే క‌నిపిస్తుంది.

స‌మంత చివ‌రిగా `ఖుషీ`లో న‌టించింది. ఆ త‌ర్వాత అమెరికా వెళ్లిపోవ‌డం...అక్క‌డ నుంచి ఇన్ స్టాలో అభిమా నుల‌కు ట‌చ్ లో ఉంది. త్వ‌ర‌లోనే కంబ్యాక్ అవుతుంద‌ని ప్ర‌చారం సాగుతుంది. ప్ర‌స్తుతం సామ్ `సీటాడెల్` వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లోనూ కంటున్యూ అవుతుంది. తాప్సీ నిర్మాణ సంస్థ‌లో ఓ సినిమాకి అగ్రిమెంట్ జ‌రిగింద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.