Begin typing your search above and press return to search.

ఇలా అయితే కష్టమే 'పుష్ప'?

అయితే గత కొద్ది రోజులుగా 'పుష్ప2' రిలీజ్ వాయిదా పడబోతుందని వార్తలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Jan 2024 2:00 PM GMT
ఇలా అయితే కష్టమే పుష్ప?
X

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప 2' సినిమాపై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్ట్-1 భారీ సక్సెస్ అందుకోవడంతో 'పుష్ప 2' ని అంతకుమించి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

అయితే గత కొద్ది రోజులుగా 'పుష్ప2' రిలీజ్ వాయిదా పడబోతుందని వార్తలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా ఈ న్యూస్ బాగా ప్రచారం చేసింది. ఆగస్టు 15న బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ 'సింగం అగైన్' రిలీజ్ ఉండడంతో 'పుష్ప 2' ని వాయిదా వేస్తున్నారని, 'పుష్ప: ది రైజ్' కి బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్స్ రావడంతో అక్కడ సోలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకోవడంతో వాయిదా వేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది.

ఆ తర్వాత మూవీ టీమ్ సుకుమార్ బర్త్ డే అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అందులో ఆగస్టు 15న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్లో రష్మిక జాయిన్ అయింది. సుకుమార్ ఇప్పటికే బన్నీ, రష్మీక లపై సాంగ్ కూడా షూట్ చేసినట్లు తెలిసింది. అయితే 'పుష్ప 2' కోసం రష్మిక ని ఇంకా 50 రోజులు డేట్స్ కావాలని నిర్మాతలు అడిగినట్లు తాజాగా ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది.

హీరోయిన్ నుంచి మరో 50 రోజులు కాల్ షీట్స్ అడిగారంటే అసలు ఇప్పటిదాకా ఎంత షూట్ పూర్తి చేశారు? ఇంకెంత షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇలా అయితే ఆగస్టు 15న సినిమా కూడా రిలీజ్ కష్టమే? అనే వాదనలు సైతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మరి మూవీ టీం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేస్తారా? లేక పోస్ట్ పోన్ చేస్తారా? అనేది చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ అగ్ర హీరో ఫాహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.