Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : నిన్ను చూస్తే గుండె జారి గల్లంతయ్యిందే

ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఏమాత్రం అందం తగ్గలేదు కదా.. పై పెచ్చు అందం చాలా పెరిగిందనే కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:39 AM GMT
పిక్ టాక్‌ : నిన్ను చూస్తే గుండె జారి గల్లంతయ్యిందే
X

నితిన్ హీరోగా నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఇషా తల్వార్. ఈ అమ్మడు తెలుగు లో పెద్దగా సినిమాలు చేయకున్నా కూడా చేసిన కొన్ని సినిమాలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు మరియు వీడియోలకు మంచి రెస్పాన్స్‌ వస్తూ ఉంటుంది. హిందీ, తమిళ్‌, మలయాళ సినిమాలతో కెరీర్ లో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. అయితే ఇలాంటి ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా మళ్లీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందా అనే ఆసక్తి కలుగుతుంది.

కవ్వించే చూపులతో, నాజుకు అందాలతో ఈ అమ్మడు ఎప్పుడు ఒకే మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఏమాత్రం అందం తగ్గలేదు కదా.. పై పెచ్చు అందం చాలా పెరిగిందనే కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు.

ఆకట్టుకునే అందంతో ఈ అమ్మడి ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. ఈసారి కూడా అంతకు మించిన అందంతో ముద్దుగుమ్మ ఇషా తల్వార్ కన్నుల విందు చేస్తుంది. ఇంతటి అందను తెలుగు ప్రేక్షకులు మిస్‌ అవుతున్నారా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.