సినిమాలు చూస్తూ చీకట్లో నోట్స్ రాసుకునేవాడిని
రీసెంట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరిగిన హోమ్ బౌండ్ సినిమాకు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ ఖట్టర్ తన కెరీర్ తొలి నాళ్ల గురించి మాట్లాడారు.
By: Tupaki Desk | 22 Jun 2025 11:53 AM ISTరీసెంట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ జరిగిన హోమ్ బౌండ్ సినిమాకు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ ఖట్టర్ తన కెరీర్ తొలి నాళ్ల గురించి మాట్లాడారు. ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించిన హోమ్ బౌండ్ సినిమాను ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగ్ చేశారు. అన్‌సర్టెన్ రిగార్డ్ కేటగిరీలో ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కళాత్మక విలువలతో రూపొందించిన సినిమాలను ఈ కేటగిరీలో ప్రదర్శిస్తారు.
కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఈ హీరో ఫిల్మ్ ఫెస్టివల్సే తనకు చదువు అని అన్నాడు. మూడేళ్ల పాటూ తాను వీలైనన్ని ఎక్కువ స్క్రీనింగ్స్ కు హాజరైనట్టు తెలిపాడు. ఈ విషయంలో తనకో పర్సనల్ రికార్డు ఉందని, ఒకే రోజులో తాను ఆరు సినిమాలు చూశానని చెప్పాడు. కేవలం సినిమాలను చూడటమే కాకుండా ఇషాన్ దానిపై నోట్స్ కూడా రాసుకుంటాడట.
సినిమాలను టెక్ట్స్ బుక్స్ లాగా అనుకుని, సినిమా చూస్తూ చీకట్లోనే నోట్స్ రాసుకోవడం గురించి కూడా ఇషాన్ ఖట్టర్ వెల్లడించాడు. సినిమాపై ఎంతో డెడికేషన్ ఉంటే తప్ప ఇలా ఒకే రోజు ఆరు సినిమాలు చూడరని, కేవలం సినిమాలు చూడటమే కాకుండా నోట్స్ రాసుకోవడం కూడా అంటే ఇషాన్ ఖట్టర్ సినిమాలపై ఎంత ప్యాషన్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ఇషాన్ ఖట్టర్ మాట్లాడుతూ ఇది చాలా పవిత్రమైన చోటని, ఎప్పటికైనా నా సొంత సినిమాతో అక్కడికి వెళ్లాలని కలలు కనే వాడినని తెలిపాడు. హోమ్ బౌండ్ సినిమాతో ఆ కోరిక తీరిందని చెప్పాడు. ఇషాన్ కు కేన్స్ అనేది కేవలం రెడ్ కార్పెట్ గ్లామర్ మాత్రమే కాదు, కెరీర్లో ఎదిగి గొప్ప స్టూడెంట్ గా పాత స్కూల్ కు వెళ్లడం లాంటిదని ఆయన మాటలు వింటే తెలుస్తోంది.
