Begin typing your search above and press return to search.

పెళ్లిలో ఇషా అంబానీ 3D గౌనుపైనే క‌ళ్ల‌న్నీ

ఈ డిజైన‌ర్ డ్రెస్ లో 3D చెర్రీ పువ్వులు , స్వరోవ్‌స్కీ స్ఫటికాల గంభీరమైన నెమలి ఎంబ్రాయిడరీతో అల్లుకున్న‌ మాగ్నోలియా పూల కొమ్మలతో కార్సెటెడ్ ఫిగర్-హగ్గింగ్ గౌను ప్ర‌త్యేక శోభ‌ను తెచ్చింది.

By:  Tupaki Desk   |   2 March 2024 1:51 PM GMT
పెళ్లిలో ఇషా అంబానీ 3D గౌనుపైనే క‌ళ్ల‌న్నీ
X

గుజ‌రాత్ జామ్ న‌గ‌ర్‌లోని అంబానీల పెళ్లి వేడుక గురించే ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఈ వేదిక వ‌ద్ద‌కు వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ పాప్ స్టార్ రిహానా విచ్చేయ‌మే గాక‌, ప‌లువురు టాప్ సెల‌బ్రిటీలు, పారిశ్రామిక‌వేత్త‌లు, సినీరాజ‌కీయ రంగాల నుంచి విచ్చేయ‌డంతో వేదిక అంతా సంద‌డిగా మారింది.

అయితే ఇలాంటి స్టార్ స్ట‌డెడ్ వేడుక‌లో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తన ఫ్యాషన్ ఎంపిక ప‌రంగా షో స్టాప‌ర్ గా నిల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో ఇషా అంబానీ కోచర్ లేబుల్ మిస్ సోహీ రూపొందించిన 3D ఎంబ్రాయిడరీ గౌనులో అద్భుతంగా కనిపించింది. ఇషా రాయల్ లుక్ తో మైమ‌రిపించింది.

ఈ డిజైన‌ర్ డ్రెస్ లో 3D చెర్రీ పువ్వులు , స్వరోవ్‌స్కీ స్ఫటికాల గంభీరమైన నెమలి ఎంబ్రాయిడరీతో అల్లుకున్న‌ మాగ్నోలియా పూల కొమ్మలతో కార్సెటెడ్ ఫిగర్-హగ్గింగ్ గౌను ప్ర‌త్యేక శోభ‌ను తెచ్చింది. ఇషా స్ప్రింగ్/సమ్మర్ 2024 గౌనును శిల్పకళా శాలువాతో క‌వ‌రప్ చేసింది. అందువలన సంపన్నమైన సిల్హౌట్‌కు విలాసవంతమైన అప్పియ‌రెన్స్ ని జోడించడం సాధ్య‌మైంది.

పెయింటింగ్ అప్పియ‌రెన్స్ ..ఇషాజీ మాయా ఫ్యాషన్ క్షణం ఒక సుందరమైన పూల నేపథ్యంలో అందంగా కుదిరింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ అనితా ష్రాఫ్ అడజానియా ఇన్ స్టాలో దీనిని షేర్ చేసారు. ఇషా కస్టమ్ కోచర్ లుక్‌ని స్టైల్ చేసిన అనిత త‌న‌ మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలకాలం గుర్తుండిపోయేలా లుక్ ని డిజైన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఇషా 3డి గౌను వేదిక వ‌ద్ద షో స్టాప‌ర్ గా నిల‌బెట్టింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగుతుండగా, మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, దీపికా పదుకొనే సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. , రణ్‌వీర్ సింగ్, అలియా భట్, రణబీర్ కపూర్, అక్షయ్ ఖన్నా, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, సైనా నెహ్వాల్, షానయా కపూర్, అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్, హార్దిక్ పాండ్యా, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, ఇవాంక, వరుణ్ ద్వాన్కా శ్రద్ధా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, నీతూ కపూర్, మాధురీ దీక్షిత్ తదితరులు వేడుక‌కు అటెండ‌యిన వారిలో ఉన్నారు. మూడు రోజుల పాటు విలాస‌వంతంగా జ‌రుగుతున్న ప్రీవెడ్డింగ్ వేడుక‌ల‌లో రెండో రోజు ముగుస్తోంది.