నాగార్జున హీరోయిన్ విడాకుల మ్యాటర్
నాగార్జున సరసన `చంద్రలేఖ` చిత్రంలో నటించింది ఇషా కొప్పికర్. అంతకుముందు 1997లో తెలుగు చిత్రం W/o వి.వర ప్రసాద్ తో టాలీవుడ్‌కి పరిచయమైంది
By: Tupaki Desk | 1 July 2025 8:00 AM ISTనాగార్జున సరసన `చంద్రలేఖ` చిత్రంలో నటించింది ఇషా కొప్పికర్. అంతకుముందు 1997లో తెలుగు చిత్రం W/o వి.వర ప్రసాద్ తో టాలీవుడ్‌కి పరిచయమైంది. ముఖ్యంగా ఇషా హిందీ చిత్రాలలో కనిపించింది. ఫిజా, ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, చాందిని చౌక్ టు చైనా, పింజర్, దిల్ కా రిష్టా, కృష్ణ కాటేజ్, రుద్రాక్ష్, హమ్ తుమ్, ఇంతేకం: ది పర్ఫెక్ట్ గేమ్‌లలో తన నటనకు గుర్తింపు పొందింది.
అయితే కెరీర్ పరంగా అవకాశాలు తగ్గిన క్రమంలోనే టిమ్మీ నారంగ్ ని ఇషా పెళ్లాడింది. ఇది ప్రేమవివాహం. కానీ మనస్ఫర్థలతో విడిపోయారు.. వారికి ఒక అందమైన కుమార్తె కూడా ఉంది. ఇషా కొప్పికర్ 14 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలకాల్సి వచ్చింది. ఆ నిర్ణయం కఠినమైనది.. కానీ అవసరమైనదని ఇషా అంది. తల్లిదండ్రులుగా తాము ఎదుర్కొనే సవాళ్ల గురించి కూడా ఇషా మాట్లాడింది. టిమ్మీ నుండి విడిపోవడానికి కారణాలను ప్రశ్నిస్తే... తాను ఒకరిని నిందించనని అంది. విడిపోవడానికి టిమ్మీ కారణమని, ఇద్దరి మధ్యా అనుబంధం పని చేయడలేదని తెలిపింది. విడాకులను తిరస్కరించడం ఆమెకు సులభం అయినా అది తన ఆలోచనలు, విలువలకు విరుద్ధంగా ఉంటుందని ఇషా చెప్పింది. మేం స్నేహపూర్వకంగా విడిపోయినా కష్టదశను ఎదుర్కొన్నామని ఇషా తెలిపింది.
ఘాఢమైన ఆధ్యాత్మిక భావనలు ఉన్న వ్యక్తి ఇషా, చివరికి తాను వెతుకుతున్న సమాధానాలను కనుగొన్నానని చెప్పింది. నిరంతరం గొడవలకు పరిస్థితులు దారితీస్తే కలిసి ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి? నీరు నిలిచి ఉన్నప్పుడు కూడా దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది! అని తనదైన శైలిలో పరిస్థితిని వెల్లడించింది. ఇక టిమ్మీ నుంచి విడిపోయిన విషాయాన్ని తమ కుమార్తె రియానాకు చెప్పినప్పుడు చాలా నిరాశకు గురయ్యానని తెలిపింది. అతడి పద్ధతులు `బాధ్యతారాహిత్యం`తో కూడుకున్నవని పేర్కొంది.
ఇషా - టిమ్మీ నవంబర్ 2023లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. 14 సంవత్సరాల వైవాహిక బంధాన్ని అనూహ్యంగా ముగించారు. జిమ్‌లో ప్రేమలో పడిన ఈ జంట తర్వాత నవంబర్ 2009లో వివాహం చేసుకున్నారు. వారు డేటింగ్ ప్రారంభించడానికి ముందు మూడు సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసుకున్నారు. వారి కుమార్తె రియానా జూలై 2014లో జన్మించింది.
