Begin typing your search above and press return to search.

మెగా బాస్ రిస్క్ తీసుకుంటాడా..?

వచ్చే సంక్రాంతికి పాన్ ఇండియా లెవెల్ లో విశ్వంభర రిలీజ్ కు రెడీ అవుతుంది.

By:  Tupaki Desk   |   11 March 2024 6:05 AM GMT
మెగా బాస్ రిస్క్ తీసుకుంటాడా..?
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ చిరుని గుర్తు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్ తో విశ్వంభర రాబోతుంది. ఆడియన్స్ కు పర్ఫెక్ట్ ఐ ఫీస్ట్ అందించేలా సినిమా ప్లాన్ చేస్తున్నారు వశిష్ట. ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ పై 150 నుంచి 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. వచ్చే సంక్రాంతికి పాన్ ఇండియా లెవెల్ లో విశ్వంభర రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత చిరు కన్ఫర్మ్ చేసిన సినిమాలు అయితే లేవు. హరీష్ శంకర్, అనీల్ రావిపుడి లాంటి డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు. అయితే చిరుతో సినిమా చేయాలని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి ఆసక్తిగా ఉన్నారట. తమిళంలో మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నారు. సింగం సీరీస్ లతో హరి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

కామన్ గా అయితే తమిళంలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకులు తెలుగులో కూడా సినిమాలు చేస్తారు. కానీ హరి ఇంతవరకు టాలీవుడ్ వైపు చూడలేదు. ప్రస్తుతం విశాల్ తో రత్నం సినిమా చేసిన హరి తెలుగులో సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. వాళ్లు వీళ్లు కాదు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేయాలని అనుకుంటున్నారట. చిరుకి సరిపోయే కథ ఒకటి రెడీ చేశారట హరి త్వరలోనే చిరుని కలిసి కథ వినిపించాలని చూస్తున్నారు. ఆల్రెడీ నిర్మాత కూడా రెడీగా ఉన్నాడని టాక్.

హరి డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తాడా లేదా అన్నదే డౌట్ కొడుతుంది. తమిళ దర్శకుల కన్నా తెలుగు దర్శకులతోనే చిరు పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ రీమేక్ చేసినా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే రీమేక్ లతో రిస్క్ ఎందుకని లైట్ తీసుకున్నాడు చిరు. ఇప్పుడు మరో తమిళ దర్శకుడు హరి వచ్చి సొంత కథతో సినిమా చేస్తానన్నా చిరంజీవి ఒప్పుకునే అవకాశాలు తక్కువ అని చెప్పొచ్చు. అయితే హరి చెప్పిన కథ బాగా నచ్చితే ఎలాగు డైరెక్టర్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి మెగా బాస్ ఓకే చేసినా చేయొచ్చని చెప్పుకుంటున్నారు.