Begin typing your search above and press return to search.

ల‌వ‌ర్స్ తో అట్లీ ప్లాన్ చేస్తున్నాడా

ఇటీవ‌లే అట్లీ దంప‌తులు ఉజ్జ‌యిని మ‌హాకాలేశ్వ‌ర ఆల‌యంలో భ‌జ‌నా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Dec 2023 1:30 AM GMT
ల‌వ‌ర్స్ తో అట్లీ ప్లాన్ చేస్తున్నాడా
X

ప్రేమికుల జోడీతో అట్లీ సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా? ఆన్ స్క్రీన్ పై ఆ జోడిని చూపించి సూప‌ర్ హిట్ కొట్టాల‌నుకుంటున్నాడా? అంటే అవున‌నే అనిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రా జోడీ? అట్లీ టార్గెట్ చేసిన ఆ ప్రేమికులు ఎవ‌రు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఇటీవ‌లే అట్లీ దంప‌తులు ఉజ్జ‌యిని మ‌హాకాలేశ్వ‌ర ఆల‌యంలో భ‌జ‌నా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఆ దంప‌తులు ఇద్ద‌రి ముందు ఇద్ద‌రు ప్రేమికులు కూర్చున్నారు.

వాళ్లే జాన్వీక‌పూర్ -శిఖ‌ర్ ప‌హారియా. వీళ్లిద్ద‌రు కొంత కాలంగా సీరియ‌స్ గా ల‌వ్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టు జంట‌గా చిక్కిన సంద‌ర్భాలెన్నో. క‌లిసి ప‌బ్ ల‌కు వెళ్ల‌డం ద‌గ్గ‌ర నుంచి గుళ్లు గోపురాలు చుట్టేయ‌డం వ‌ర‌కూ ఈ జోడీ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇదే జోడీతో అట్లీ ఓ బ్యూటీపుల్ ల‌వ్ స్టోరీ ఏదైనా రాస్తున్నాడా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఉజ్జ‌యిని ఆల‌యంలో ఆ న‌లుగురు ఒకేసారి క‌నిపించ‌డం ఈ సందేహాల‌కి తావిస్తోంది. అట్లీ కోలీవుడ్ కి చెందిన ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే షారుక్ కి `జ‌వాన్` తో భారీ హిట్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత షారుక్-విజ‌య్ తో ఓ మ‌ల్టీస్టార‌ర్ కి స్టోరీ సిద్దం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కానీ ఈ మెగా ప్రాజెక్ట్ కంటే ముందే అట్లీ జాన్వీతో సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తుంది. `జ‌వాన్` విడుద‌లైన ద‌గ్గ‌ర నంచి ఇంత‌వ‌ర‌కూ అట్లీ కోలీవుడ్ నుంచి ఫ‌లానా సినిమా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది లేదు.

అట్లీ ఒకే చెబితే హీరోలంతా క్యూలో ఉంటారు. కానీ అట్లీ కోలీవుడ్ కంటే?? బాలీవుడ్ పై నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్న‌ట్లు కొన్ని సంకేతాలు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జాన్వీ-ప‌హారియాని తెర‌పైకి తెస్తున్న ట్లు క‌నిపిస్తుంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఏంటి? అన్న‌ది అట్లీ రివీల్ చేస్తే త‌ప్ప క్లారిటీ రాదు.