Begin typing your search above and press return to search.

స్వీటీ సైన్యం తో వ‌చ్చేదెప్పుడు?

అరుంధ‌తిగా..దేస‌వ‌న‌గా సాలిడ్ పాత్ర‌ల్లోచూసిన అమెని సాప్ట్ రోల్స్ లో ఊహించుకోలేక‌పోతున్నారు.

By:  Tupaki Desk   |   30 April 2024 12:30 AM GMT
స్వీటీ సైన్యం తో వ‌చ్చేదెప్పుడు?
X

స్వీటీ అనుష్క స‌రైన కంబ్యాక్ కోసం తెలుగు ఆడియ‌న్స్ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` తో కంబ్యాక్ అయినా అది బెస్ట్ కంబ్యాక్ గా నిల‌వ‌లేదు. స్వీటీ మార్క్ సినిమా గా పండ‌లేదు. ఆమెకున్న ఫ్యాన్ బేస్ కి ఆ సౌండింగ్ స‌రిపోదు. అమ్మ‌డు ఎంట‌ర్ అవుతుందంటే? అరుంధ‌తిలో ద‌ద్ద‌రిల్లిపోవాలి. అలాంటి సాప్ట్ కంటెంట్లు స్వీటీకి వ‌ర్కౌట్ కాద‌ని ఓసెక్ష‌న్ ఆడియ‌న్స్ లో బ‌లంగా ఉన్న అభిప్రాయం. అరుంధ‌తిగా..దేస‌వ‌న‌గా సాలిడ్ పాత్ర‌ల్లోచూసిన అమెని సాప్ట్ రోల్స్ లో ఊహించుకోలేక‌పోతున్నారు.

ఇదే కొన‌సాగితే పీసీ మేనియా అంత‌కంత‌కు ప‌డిపోతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అమ్మ‌డు మ‌రోసారి క్రిష్ తో చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇద్ద‌రి కాంబినేష్ లో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రం తెర‌కెక్కుతోంది. క్రిష్ సంచ‌ల‌న వాస్త‌వ క‌థాంశంతో ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు గ‌ట్టిగానే ప్ర‌చారం సాగుతుంది. ఒడిశాలోని ఓ లేడీ జీవితంలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కి స్తున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇది ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన అంశం అని వినిపిస్తుంది. ఇలాంటి క‌థ‌లు దొరికితే క్రిష్ చేల‌రేగిపోతాడు. త‌న‌దైన మార్క్ మేకింగ్తో అద‌ర‌గొడ‌తాడు. గ‌మ్యం.. వేదం లాంటి సినిమాల్ని ఎంత అద్భుతంగా తీసాడో తెలిసిందే. మ‌రోసారి అంత‌కు మించిన ఇంపాక్ట్ తో స్వీటీ సిన‌మా ఉంటుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇంకా అనుష్క‌కి సంబంధించి ఎలాంటి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ కాలేదు.

ఈ నేప‌థ్యంలో సినిమా ఇదే ఏడాది రిలీజ్ ఉంటుందా? లేక 2025 లో రిలీజ్ చేస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. నిజానికి ఈ సినిమా ప్రారంభిచిన‌ట్లు గానీ..షూటింగ్ ద‌శ‌ని గానీ కూడా ఎక్క‌డా లీక్ చేయ‌లేదు. నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ ప్ర‌తీది గోప్యంగా ఉంచింది. క్రిష్ కూడా ఎలాంటి హ‌డావుడి చేయ‌డం లేదు. దీంతో ఈ ద్వ‌యం సైలెంట్ గా పెద్ద సంచ‌ల‌నాన్నే ప్లాన్ చేసిందా? అన్న సందేహం వ‌చ్చేస్తుంది.