చాన్నాళ్లకు ఆది సాయికుమార్ హిట్టు సినిమా..!
సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ ప్రేమ కావాలి సినిమాతో 2011లో తెరంగేట్రం చేశాడు.
By: Tupaki Desk | 25 Dec 2025 10:20 AM ISTసాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ ప్రేమ కావాలి సినిమాతో 2011లో తెరంగేట్రం చేశాడు. 14 ఏళ్ల కెరీర్ లో పాతిక పైగా సినిమాలు చేశాడు ఆది. ఐతే మొదట్లో ప్రేమ కావాలి ఆ తర్వాత లవ్లీ ఇలా యూత్ ని ఎంగేజ్ చేసే లవ్ స్టోరీస్ చేసిన అతను ఆ తర్వాత ఎందుకో ఆకట్టుకోలేకపోయాడు. ఐతే పట్టువదలని విక్రమార్కుడిలా సక్సెస్ కోసం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు ఆది సాయికుమార్. తండ్రి ఎంత గొప్ప నటుడు అయినా సరే కొడుక్కి హిట్టు రావట్లేదే అన్న ఆలోచన సాయి కుమార్ కి ఉంది.
ఆది సినిమాలు థియేటర్లో ఎప్పుడు వస్తున్నాయో..
ఐతే ఎలాంటి స్టార్ కి అయినా కెరీర్ లో ఒక స్ట్రాంగ్ సినిమా పడితే చాలు అదే మిగతా కెరీర్ ని టర్న్ చేస్తుంది. ఆది సాయి కుమార్ కి ఈ 25 సినిమాల జర్నీలో అలాంటి సినిమా ఒకటి పడలేదు. ఈమధ్య ఆది సినిమాలు థియేటర్లో ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో అన్నది కూడా తెలియని విధంగా పరిస్థితి మారింది. మంచి కం బ్యాక్ కోసం ఆది వెయిట్ చేస్తున్నాడు. ఈ టైంలోనే శంబాల సినిమా వచ్చింది.
సైన్స్ తో శాస్త్రాలను ముడిపెట్టి చాలా సినిమాలు వచ్చాయి. ఐతే వాటిలో శంబాల ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనిపించుకుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ తోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. శంబాలా టాక్ చూస్తే ఆది సాయి కుమార్ కి హిట్ పడినట్టే అని చెప్పొచ్చు. ఐతే ఇన్నేళ్ల కెరీర్ లో ఆది చాలా కాన్ఫిడెంట్ గా వస్తున్నాం కొడుతున్నాం అని చెప్పిన సినిమా ఇదే.
శంబాల సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి..
శంబాల సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాపై ఒక పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఆది సాయి కుమార్ ఈ సినిమాలో విక్రం రోల్ లో నటించాడు. సినిమాను ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. ఆది సాయి కుమార్ శంబాల నుంచి తన కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
14 ఏళ్ల కెరీర్.. 25 సినిమాలకు పైగా అనుభవం ఉన్న ఆది సాయి కుమార్ ఆడియన్స్ ని మెప్పించే కథలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో ఇక మీదట ఎక్స్ పెరిమెంట్స్ కూడా చేసేందుకు రెడీ అనేస్తున్నాడు. శంబాల సినిమాతో ఆది ఖాతాలో ఒక హిట్ పడింది. ఈ హిట్ తో అతని కెరీర్ టర్న్ అయ్యి ఇదే హిట్ ఫాం కొనసాగించాలని ఆడియన్స్ కోరుతున్నారు. ఆది సాయికుమార్ టాలెంట్ ని వాడుకుని అతనికి సరిపడే కథలతో సినిమాలు చేయాలని భావిస్తున్నారు. మరి శంబాల హిట్ ఆది సాయి కుమార్ కెరీర్ ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అన్నది చూడాలి. శంబాల మీద ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఆది సాయి కుమార్ ఆడియన్స్ కి ఒక మంచి సినిమా అందిస్తే దాన్ని తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని గుర్తించాడని తెలుస్తుంది.
