Begin typing your search above and press return to search.

Irumudi Movie First Talk: రవితేజకు ఈసారి హిట్ పడినట్టేనా?

వరుస పరాజయాల తర్వాత రవితేజ చేసిన ‘ఇరుముడి’ ఆయన కెరీర్‌లో పూర్తిగా భిన్నమైన ప్రయత్నం. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు.

By:  Tupaki Desk   |   21 Aug 2026 8:58 AM IST
Irumudi Movie First Talk: రవితేజకు ఈసారి హిట్ పడినట్టేనా?
X

వరుస పరాజయాల తర్వాత రవితేజ చేసిన ‘ఇరుముడి’ ఆయన కెరీర్‌లో పూర్తిగా భిన్నమైన ప్రయత్నం. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. తండ్రీ-కూతుళ్ల అనుబంధం, బాలికల భద్రత, వారి సాధికారత వంటి సామాజిక అంశాలను థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కలిపి చెప్పే ప్రయత్నం చేసింది.

త్రినాథ్ పాత్రలో రవితేజ చాలా కాలం తర్వాత నటుడిగా తన సత్తా చాటారు. మాస్ మహారాజా ఇమేజ్‌కు దూరంగా, ఒక తండ్రిగా ఆయన చూపించిన భావోద్వేగ నటన సినిమాకు ప్రధాన బలం. చిన్నారి నక్షత్ర కూడా కీలక పాత్రలో అద్భుతంగా నటించింది. ప్రియా భవానీ శంకర్, సాయికుమార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

శివ నిర్వాణ ఎంచుకున్న ప్రధాన కథాంశం సామాజికంగా చాలా ప్రాధాన్యత కలిగినది. ఇద్దరు తండ్రులు.. తమ కూతుళ్లను పెంచే రెండు విభిన్న విధానాల ద్వారా బాలికలకు ధైర్యం చెప్పడం, సమస్యలను ఎదుర్కొనేలా చేయడం అనే అంశాన్ని బలంగా చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో థ్రిల్లర్ టెన్షన్ బాగా వర్కవుట్ కాగా, తండ్రీ-కూతుళ్ల ఎమోషన్స్ సినిమాకు హృదయంగా నిలిచాయి.

అయ్యప్ప స్వామి నేపథ్యం, రెండు పాటలు, జీవీ ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం. అయితే ప్రారంభంలో కొన్ని నిమిషాలు, ట్విస్ట్ తర్వాత వచ్చే ప్రీ-క్లైమాక్స్ భాగాలు కాస్త ఫార్ములాయిక్‌గా అనిపిస్తాయి.

మొత్తానికి ‘ఇరుముడి’ సందేశంతో పాటు బలమైన భావోద్వేగాలను అందించే సినిమా. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను కదిలించే అవకాశం ఉంది. రవితేజ కెరీర్‌లో ఒక మంచి, గౌరవప్రదమైన ప్రయత్నంగా నిలుస్తుంది.

బాటమ్ లైన్: ఎమోషనల్.. ఎంగేజింగ్.. ఎంపవరింగ్!

Full & Complete Review Soon on http://Tupaki.com