ఇజ్రాయెల్ - ఇరాన్ వార్..`ధురంధర్ 2` పరిస్థితేంటీ?
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు.
By: Ravindar Gorantla | 3 March 2026 2:38 PM ISTఅమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన కార్యాలయంపై ఇరు దేశాలు దాడి చేయడంతో ఖమేనీతో పాటు 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతి చెందడం తెలిసిందే. దీంతో పశ్చిమాశియా భగ్గుమంది. ఇరాన్ తమ సుప్రీమ్ లీడర్ మృతి చెందడంతో ప్రతీకార దాడులకు దిగుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా ఏయిర్ బేస్‌లున్న యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ కంట్రీస్‌పై విరుచుకుపడుతోంది.
దీంతో పశ్చిమాసియా దేశాల్లో భయానక వాతవరణం నెలకొని అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాలకులు ఎలాంటి భయాలు అవసరం లేదని భరోసా ఇస్తున్నా ప్రజల్లో మాత్రం యుద్ధభయాలు అలుముకున్నాయి. అంతే కాకుండా గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేస్తూ భీభత్సాన్ని సృష్టిస్తోంది. అఈ నేపథ్యంలో అమెరికా వర్గాలు వీలైనంత వరకు ఆయా దేశాలని పౌరులు ఖాలీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తోంది. ఇప్పటికే కొంత మంది సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నా మరి కొంత మంది పౌరులు గల్ఫ్ దేశాల్లోనే ఉండటంతో అంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని అమెరికా హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఇదిలా ఉంటే తాజా పరిణామాలు, ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ `ధురంధర్ 2`కు షాక్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ మూవీ మార్చి 19న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కేవలం హిందీలో మాత్రమే విడుదలై భారీ వసూళ్లని రాబట్టింది. అయితే పార్ట్ 2ని మాత్రం హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ భారీగా రిలీజ్ చేస్తుండటం, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్‌కి ఆసక్తికరమైన అంశాలని లీడ్‌గా వదలడంతో పార్ట్ 2 `ధురంధర్ ది రివేంజ్`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
అయితే తాజాగా మొదలైన యుద్ధం `ధురంధర్ 2` రిలీజ్‌పై భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫస్ట్ పార్ట్ గల్ఫ్ దేశాల్లో రిలీజ్ కాలేదు. కారణం ఆయా దేశాలు ఈ మూవీ పాకిస్థాన్‌తో పాటు తమకు కూడా వ్యతిరేకంగా ఉందని భావించి బ్యాన్ చేశాయి. దీంతో అక్కడి మార్కెట్ నుంచి రావాల్సిన రూ.150 కోట్లని ఈ సినిమా కోల్పోయింది. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పార్ట్ 2పై కూడా గల్ఫ్ దేశాలు నిషేధిస్తాయి. దీంతో ఈ సినిమా రూ.300 కోట్లు కోల్పోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక్కడో విషయం చెప్పాలి. గల్ఫ్ దేశాలు ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశం లేదు. అందు వల్ల `ధురంధర్ 2`కు వచ్చే నష్టమేమీ లేదని, ఫస్ట్ పార్ట్‌ని నిషేధించిన ఆయా దేశాలు సెకండ్ పార్ట్‌ని కూడా నిషేధిస్తాయని, అక్కడ రిలీజ్‌కు ఇప్పటికీ అనుమతి లభించలేదని, ఈ నేపథ్యంలో `ధురంధర్ 2` ఎలా నష్టపోతుందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో మార్చి 19న రిలీజ్ అవుతోంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో `ధురంధర్ 2`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
