ఐపీఎల్ వాయిదా.. సినిమాలకు కలిసొచ్చిందా? లేదా?
అలాంటిది ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో ఐపీఎల్ సినిమాను పూర్తిగా డామినేట్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే టాలీవుడ్‌లో ఈ వీకెండ్ థియేటర్లు జనంతో కళకళలాడుతున్నాయి.
By: Tupaki Desk | 12 May 2025 10:19 AM ISTసినిమాలపై క్రికెట్ మ్యాచ్ ల ప్రభావం గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐపీఎల్ సమ్మర్ బాక్సాఫీస్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. టాక్ ఎంతో బాగుంటే కానీ జనాలు థియేటర్లకు రావడం లేదు. అలాంటిది ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో ఐపీఎల్ సినిమాను పూర్తిగా డామినేట్ చేసే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే టాలీవుడ్‌లో ఈ వీకెండ్ థియేటర్లు జనంతో కళకళలాడుతున్నాయి.
ఎందుకంటే సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపధ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడటంతో సినిమా ఆడియన్స్ థియేటర్ల వైపు మళ్లారు. ఈ వీకెండ్ సాయంత్రం, రాత్రి షోలకు భారీ ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ‘సింగిల్’, ‘హిట్ 3: ది థర్డ్ కేస్’, ‘శుభం’ సినిమాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి వసూళ్లను రాబట్టయి. ఈ సినిమాలు ఆడియన్స్‌ను ఆకర్షిస్తూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.
‘సింగిల్’ సినిమా శ్రీ విష్ణు నటన, కామెడీ టైమింగ్‌తో ఆకర్షిస్తోంది. కార్తిక్ రాజు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సమ్మర్ ఎంటర్‌టైనర్ మే 9న విడుదలై, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ‘హిట్ 3’ నాని ఇంటెన్స్ కాప్ రోల్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సమంత నిర్మాతగా ‘శుభం’ సినిమా కూడా కామెడీ హారర్ థ్రిల్లర్‌గా అభిమానులను అలరిస్తోంది. ఈ మూడు సినిమాలు ఈ వీకెండ్‌లో థియేటర్లను కళకళలాడేలా చేస్తున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడటం ఈ సినిమాలకు కలిసొచ్చింది. సాధారణంగా ఐపీఎల్ సీజన్‌లో ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతారు, దీంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. అయితే, ఈ వీకెండ్ ఐపీఎల్ మ్యాచ్‌లు లేకపోవడంతో శనివారం, ఆదివారం సాయంత్రం, రాత్రి షోలకు భారీ ఆక్యుపెన్సీ నమోదైంది. మూడు సినిమాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లో హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళ్తున్నాయి.
‘సింగిల్’ సినిమాకు హైదరాబాద్‌లో పలు ఏరియల్లో 60% నుంచి 70% ఆక్యుపెన్సీ నమోదైంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ సన్నివేశాలు యూత్‌ను ఆకర్షిస్తున్నాయి. ‘హిట్ 3’ రెండో వీకెండ్‌లో కూడా 49.95% ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది, నైజాంలో రూ.2.48 కోట్ల గ్రాస్ సాధించింది. ‘శుభం’ సినిమా కూడా సమంత ప్రమోషన్స్‌తో 40% ఆక్యుపెన్సీ సాధిస్తూ హైదరాబాద్‌లో వీకెండ్ లోనే మంచి గ్రాస్ సాధించింది.
ఈ సినిమాలు ఐపీఎల్ వాయిదా వల్ల ఈ వీకెండ్‌లో భారీ ఆదాయాన్ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం, రాత్రి షోలకు ఆడియన్స్ ఎక్కువగా రావడంతో ఈ మూడు సినిమాలు కలిపి రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు టాక్. ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే, సినిమాలు మరింత లాభాలను ఆర్జించవచ్చు.
